ఇవాళ (అక్టోబర్14) భారత్, పాక్ హైఓల్టేజ్ మ్యాచ్.. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం

ఇవాళ (అక్టోబర్14) భారత్, పాక్ హైఓల్టేజ్ మ్యాచ్.. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం

ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 12వ మ్యాచ్‌లో భారత్  చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. భారత్, పాక్ మధ్య జరిగే హైఓల్టేజ్  మ్యాచ్ కు గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 1,30,000 మంది ప్రేక్షకులు వీక్షించనున్నారు. టీవీ సెట్‌లు, డిజిటల్ పరికరాలలో కోట్లాది మంది వీక్షించేందుకు సిద్దమవుతున్నారు. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌లపై విజయాలతో ప్రపంచ కప్  మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా జట్టు భారీ స్కోర్ తో విజయం సాధించాలని చీర్స్ చెపుతున్నారు అభిమానులు. 

మరోవైపు భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో  అన్ని హోటళ్లు, లాడ్జీలు అభిమానులతో నిండిపోయాయి. ఎక్కడ చూసిన క్రికెట్ అభిమానుల సందడి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో ఇంట్లోనే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో మ్యాచ్ చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. మాల్స్, పబ్ లలో స్పెషల్ గా స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. అభిమానులకోసం  హైదరాబాద్ లోని హైటెక్స్ లో బిగ్ స్క్రీన్ ని నటి శ్రీయ శరన్. ప్రారంభించనుంది