World Cup 2023: ఇండియా- పాక్ మ్యాచ్ రీషెడ్యూల్.. మరో 8 మ్యాచ్‌లు కూడా

World Cup 2023: ఇండియా- పాక్ మ్యాచ్ రీషెడ్యూల్.. మరో 8 మ్యాచ్‌లు కూడా

ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్‌లో కీలక మార్పులు జరిగాయి. అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న జరగాల్సిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సహా మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ (ఆగస్ట్‌ 9) అధికారికంగా ప్రకటించింది.

తొలుత ప్రకటించిన షెడ్యుల్ కంటే ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 14న ఇండియా- పాక్ నిర్వహించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. అలాగే మరో ఎనిమిది మ్యాచ్‌లు కూడా రీషెడ్యూల్ చేయబడ్డాయి. అయితే వేదికల్లో ఎలాంటి మార్పులేదు. ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్ మాదిరిగానే అదే వేదికలపై మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇండియా - పాక్ మ్యాచ్‌ను అక్టోబర్ 14కు రీషెడ్యూల్ చేయడం వల్ల.. ఆరోజు జరగాల్సిన ఇంగ్లండ్ - ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌ను అక్టోబర్ 15న నిర్వహించనున్నారు. 

రీషెడ్యూల్ చేయబడిన మ్యాచ్‌ల వివరాలు

  • అక్టోబర్ 10: ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్
  • అక్టోబర్ 10: శ్రీలంక vs పాకిస్తాన్
  • అక్టోబర్ 11: ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్
  • అక్టోబర్ 11: ఇంగ్లాండ్ vs పాకిస్తాన్
  • అక్టోబర్ 12: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా
  • అక్టోబర్ 12: ఇండియా vs నెదర్లాండ్స్
  • అక్టోబర్ 13: న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్
  • అక్టోబర్ 14: ఇండియా vs  పాకిస్తాన్
  • అక్టోబర్ 15: ఇంగ్లండ్ vs ఆఫ్ఘనిస్తాన్‌

సవరించిన తర్వాత షెడ్యూల్‌

కాగా, వన్డే వరల్డ్‌కప్‌ 2023 టోర్నీ అక్టోబర్‌ 5న మొదలై నవంబర్‌ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌.. రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య జరగనుంది.