World Cup 2023: పాక్పై గెలిచి..పాక్ రికార్డును సమం చేసిన టీమిండియా

World Cup 2023: పాక్పై గెలిచి..పాక్ రికార్డును సమం చేసిన టీమిండియా

వరల్డ్ కప్ 2023లో భాగంగా పాకిస్తాన్పై విజయం సాధించడం ద్వారా టీమిండియా చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్ను 8వ సారి చిత్తు చేసింది. పాకిస్తాన్పై గెలిచిన భారత జట్టు..పాకిస్తాన్ రికార్డునే సమం చేసింది. 

వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్పై వరుసగా 8 సార్లు గెలిచిన టీమిండియా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ లలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా పాకిస్తాన్తో సమంగా నిలిచింది. పాకిస్తాన్ జట్టు వన్డే వరల్డ్ కప్లలో శ్రీలంకను 8 సార్లు ఓడించింది. వన్డే వరల్డ్ కప్లలో శ్రీలంక పాక్పై ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో తాజా విజయంతో పాకిస్తాన్ రికార్డును భారత జట్టు సమం చేసింది. 

వరల్డ్ కప్ 2023లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచులో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో సత్తా చాటిన భారత జట్టు..పాకిస్తాన్పై సూపర్ విక్టరీ కొట్టింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌట్ అయింది. బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీ సాధించాడు.  భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, పాండ్యా, కుల్దీప్, జడేజా తలా రెడు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత 192 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా 31.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ , శ్రేయాస్ అయ్యర్ అర్థ సెంచరీలతో రాణించారు.