వరల్డ్ కప్ : ఇంగ్లండ్ టార్గెట్-213

వరల్డ్ కప్ : ఇంగ్లండ్ టార్గెట్-213

సౌతాంప్టన్‌: వరల్డ్ కప్-2019లో భాగంగా శుక్రవారం ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఇండీస్ 45 ఓవర్లకు 212 రన్స్ చేసి ఆలౌటైంది. ప్రారంభంలోనే వికెట్ కోల్పోయిన విండీస్ .. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ఎక్కువ స్కోర్ చేయలేక పోయింది. గేల్(36), పూరణ్(63), రస్సెల్(21), హెట్ మేయర్(39) కాసేపు మెరిశారు.

ఇంగ్లండ్ ప్లేయర్లలో..ఆర్చర్(3), మార్క్ వుడ్(3) వికెట్లతో చెలరేగగా..రూట్(2), వోక్స్ (1), ఫ్లంకెట్(1) వికెట్లు దక్కాయి.