World Cup 2023: రామోజీ ఫిల్మ్ సిటీలో వరల్డ్ కప్ ట్రోఫీ..

World Cup 2023: రామోజీ ఫిల్మ్ సిటీలో వరల్డ్ కప్ ట్రోఫీ..

భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రదర్శించారు. గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని పలు ప్రముఖ ప్రదేశాల్లో ట్రోఫీని ప్రదర్శిస్తున్న ఐసీసీ.. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకొచ్చింది. రామోజీ గ్రూప్ సందర్శించే ఉద్యోగుల కోసం దీనిని ప్రదర్శించింది. ఫిల్మ్ సిటీలోని అద్భుతమైన క్యారమ్ గార్డెన్‌లో దీన్ని ప్రదర్శించారు.

60 సెంటీమీటర్ల పొడవున్న ఈ ట్రోఫీని లండన్‌లోని విలాసవంతమైన ఆభరణాల తయారీ కంపెనీ గారార్డ్ రూపొందించింది. ఈ ట్రోఫీ వెండితో తయారు చేయబడింది మరియు పైన బంగారు పూత ఉంటుంది. క్రికెట్‌లో ముఖ్యమైన బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ ప్రతిబింబించేలా ఈ ట్రోఫీని తయారు చేశారు. గ్లోబ్.. బంతి ఆకారాన్ని ప్రతిబింబిస్తుంది. నిలువు వరుసలు స్టంప్స్ మరియు బెయిల్స్ లాగా కనిపిస్తాయి.

ALSO READ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం

దాదాపు 11 కిలోల బరువున్న ఈ ట్రోఫీని తయారు చేసేందుకు 40 వేల పౌండ్లు వెచ్చించారు. ప్రస్తుత ధరల ప్రకారం రూ.30,85,320. ట్రోఫీని ఏ కోణం నుండి చూసినా స్పష్టంగా గుర్తించగలిగేలా ఇది ప్లాటోనిక్ ఆకారంలో రూపొందించబడింది. ఈ ట్రోఫీని మొదట 1999 ప్రపంచ కప్ కోసం రూపొందించారు. అప్పటి నుంచి ఐసీసీ ఈ డిజైన్ ట్రోఫీని కొనసాగిస్తోంది.