ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం

 ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం పడుతోంది.  ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వరంగల్,  జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో‌‌  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురస్తున్నాయి.  ఈ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్  జారీ చేసింది. 

ALSO READ : నాన్నపై చెప్పులేస్తే లేనిది.. బావ జైలుకెళితే మీసాలు తిప్పుతున్నాడు : మంత్రి రోజా

మరో  మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.  వాతావరణ శాఖ హెచ్చరికతో వరంగల్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రేటర్ మున్సిపల్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. ఉద్యోగులు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుంది.  ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు.