'సరిపోయారు ఇద్దరూ' టీజర్‌ లాంచ్.. అనిల్ రావిపూడి చేతుల మీదుగా క్రేజీ అప్‌డేట్!

'సరిపోయారు ఇద్దరూ' టీజర్‌ లాంచ్.. అనిల్ రావిపూడి చేతుల మీదుగా క్రేజీ అప్‌డేట్!

'శతమానం భవతి' చిత్రంతో జాతీయ స్ఠాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న  దర్శకుడు సతీష్ వేగేశ్న మళ్లీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయ్యారు.  ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌‌టైనర్ 'సరిపోయారు ఇద్దరూ'. స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి, సతీష్ వేగేశ్న కుమారుడు యశ్విన్ వేగేశ్న కథానాయకులుగా నటిస్తున్నారు.

లేటెస్ట్ గా మూవీ టీజర్ ను టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి ప్రత్యేక అభినందలు తెలిపారు. పల్లెటూరి వాతావరణం, వైజాగ్ సిటీ అందాల బ్యాక్‌డ్రాప్‌లో కట్ చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ప్రారంభంలో తీవ్ర పగ, ప్రతీకారాలు, ఘర్షణలతో కొట్టుకునే ఇద్దరు కుర్రాళ్ల మధ్య ఉన్న గొడవ.. అసలు వారిది కాదని, వారి తండ్రులైన సీనియర్ నటులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, వి.కె. నరేష్‌‌ ల పాత కక్షలకు ప్రతిరూపమని టీజర్‌లో చూపించిన తీరు క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తోంది.

హీరోయిన్లు రిధ్ది కుమార్, మేఘా చౌదరిలతో సాగే కలర్‌ఫుల్ లవ్ ట్రాక్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అనూప్ రూబెన్స్ అందించిన అదిరిపోయే సంగీతం, సమీర్ రెడ్డి మార్వెలస్ సినిమాటోగ్రఫీ మేకింగ్ విలువలను నెక్స్ట్ లెవెల్‌‌కి తీసుకెళ్లాయి.

ALSO READ : ఓటీటీలోకి వచ్చేసిన 'స్పైడర్-మేన్: బ్రాండ్ న్యూ డే'..

హ్యాపీ ఆక్స్ ఎంటర్టైన్మెంట్, ఎంఎస్ వారాహి క్రియేషన్స్, శతమానంభవతి ఆర్ట్స్ పతాకాలపై సాదత్, ముని శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ భారీ ఎంటర్‌టైనర్‌లో అన్నపూర్ణమ్మ, రఘుబాబు, ప్రవీణ్, సుదర్శన్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. కుటుంబ అనుబంధాలు, ఆకట్టుకునే హాస్యం, యూత్‌ఫుల్ ఎమోషన్స్ కలగలిపి రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.