నాన్నపై చెప్పులేస్తే లేనిది.. బావ జైలుకెళితే మీసాలు తిప్పుతున్నాడు : మంత్రి రోజా

నాన్నపై చెప్పులేస్తే లేనిది.. బావ జైలుకెళితే మీసాలు తిప్పుతున్నాడు : మంత్రి రోజా

అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరును మంత్రి రోజా తప్పుపట్టారు. చంద్రబాబు అరెస్టు అంశంపై సభలో చర్చిద్దామని మంత్రి బుగ్గన చెబుతున్నా.. టీడీపీ సభ్యులు మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం చూస్తే రాష్ట్ర ప్రజలకు ఒక్కటే అర్థమైంది. బావ కళ్లలో ఆనందం చూడటానికే బాలకృష్ణ ఈ విధంగా ప్రవర్తించాడని... నిజంగా ఎన్టీఆర్‌పై చెప్పులు వేసినప్పుడు తన బావ చంద్రబాబుపై బాలకృష్ణ మీసం తిప్పి, తొడలు కొట్టిఉంటే ప్రజలు హర్షించేవారని రోజా అన్నారు.  బావకోసం బాలకృష్ణ అసెంబ్లీలో రౌడీయిజం చేయడాన్ని రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. నేను బాలకృష్ణకు సూటిగా చెబుతున్నా.. ఫ్లూటును  జింక ముందు ఊదు.. సింహంలాంటి జగన్ ముందు కాదంటూ రోజా వార్నింగ్ ఇచ్చారు.

ALSO READ : ప్రేక్షకులు లేకుండానే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. టికెట్లు కొన్నోళ్ల పరిస్థితి ఏంటీ..?

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని భావిస్తే పద్దతి ప్రకారం అసెంబ్లీ చర్చకోసం అడగాలి కాని... స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సభను అగౌరవపర్చేలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని టీడీనీ ఎమ్మెల్యేలను మంత్రి రోజా  ప్రశ్నించారు.  కొద్ది మంది ఉన్న టీడీపీ సభ్యులు చట్ట సభలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రోజా.  తమ పార్టీ సభ్యులకు చట్టాలు, అసెంబ్లీ, స్పీకర్ అంటే గౌరవం ఉంది కాబట్టే సైలంట్ గా ఉన్నామన్నారు.