తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల బుకింగ్‌పై సోషల్ మీడియాలో మరోసారి చర్చ మొదలైంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో యూజర్లు ఎదుర్కొంటున్నారని చెబుతున్న సమస్యలను సెటైరికల్‌గా చూపిస్తూ చేసిన ఓ ప్యారడీ రీల్ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ursivatalks పేరుతో పోస్ట్ చేసిన ఈ రీల్‌లో... టీటీడీ టికెట్ బుకింగ్‌కు ప్రయత్నించే సమయంలో ఎదురయ్యే పరిస్థితులను సరదాగా చూపించారు.
టికెట్లు విడుదలైన వెంటనే బుకింగ్ కోసం ప్రయత్నించడం... వెబ్‌సైట్‌లో ముందుకు వెళ్లేలోపే స్లాట్లు అందుబాటులో లేకపోవడం... చివరకు పేమెంట్ దశకు చేరుకున్న సమయంలో నెట్‌వర్క్ లేదా ట్రాన్సాక్షన్ సమస్య ఎదురవుతున్నట్లుగా ప్యారడీ చేశారు. శ్రీవారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఆన్‌లైన్ బుకింగ్‌పై ఆధారపడుతున్నారు. టికెట్ల విడుదల సమయంలో ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయత్నిస్తుండటంతో బుకింగ్ అనుభవంపై సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలోనే బుకింగ్ ప్రక్రియను సెటైరికల్‌గా చూపిస్తూ వచ్చిన ఈ రీల్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే శ్రీవారి దర్శనం, టీటీడీ వంటి ఆధ్యాత్మిక అంశాలను ప్రస్తావిస్తూ చేసే ప్యారడీల విషయంలో జాగ్రత్త అవసరమని కొందరు భక్తులు అభిప్రాయపడుతున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని కూడా కొందరు కోరుతున్నారు.
మరోవైపు... ఈ వైరల్ రీల్ నేపథ్యంలో టీటీడీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విధానం, పేమెంట్ ప్రక్రియ, యూజర్లు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్న సాంకేతిక సమస్యలపైనా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భక్తులకు మరింత సులభంగా, వేగంగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించేలా వ్యవస్థను మరింత మెరుగుపరచాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి... ఒక ప్యారడీ రీల్‌తో మొదలైన చర్చ ఇప్పుడు టీటీడీ ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
