
సంగారెడ్డి టౌన్, సదాశివపేట, వెలుగు: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో డీఆర్ వో పద్మజారాణి మాట్లాడుతూ.. పొల్యూషన్ పట్ల అందరికీ అవగాహన అవసరం అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయంగా స్టీల్, జ్యూట్ బ్యాగులను వాడాలన్నారు.
ఆన్లైన్ వేదికగా నిర్వహించిన పెయింటింగ్ వ్యాసరచన పోటీలలో గెలుపొందిన స్టూడెంట్స్ కి బహుమతులను అందజేశారు. జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి గీత, గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకట నాగేంద్ర, చక్రా ప్లాస్టిక్ ఇండస్ట్రీకి సంబంధించిన సతీశ్ కుమార్, పుల్కల్ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రామకృష్ణ, ఎన్జీసీ జిల్లా సమన్వయకర్త మాధవరెడ్డి, వివిధ పరిశ్రమల ఉద్యోగులు, పీసీసీ సిబ్బంది పాల్గొన్నారు.
సదాశివపేటలో..
సదాశివపేట పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఉమా ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మొక్కలు నాటారు. అనంతరం 8 వార్డులో మిషన్ భగీరథ ట్యాంక్ వద్ద తాగు నీటి కి సంబంధించి క్లోరినేషన్ టెస్ట్ నిర్వహించారు. ఆమె వెంట ఎస్‌హెచ్‌జీ మహిళలు, సిబ్బంది ఉన్నారు.