లివింగ్ ​రిలేషన్‌‌షిప్ లో ఉండి తర్వాత పెళ్లి చేసుకొంటే…

లివింగ్ ​రిలేషన్‌‌షిప్ లో ఉండి తర్వాత పెళ్లి చేసుకొంటే…

తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేని పేరు.. క్యాథరీన్ త్రెసా. ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి వంటి చిత్రాలతో మంచి నటిగా ముద్ర వేసుకున్న క్యాథరీన్‌‌… ఈ నెల 14న ‘వరల్డ్ ఫేమస్‌‌ లవర్‌‌‌‌’తో కలిసి వస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుత‘క్రాంతి మాధవన్​గారు మంచి రైటర్. ఆయన రాసే కథల్లో దమ్ముంటుంది. ఈ కథలో కూడా చాలా పట్టు ఉంది. అందుకే కథ వినగానే నచ్చి ఓకే చెప్పా. ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్​ ప్రధానంగా ఉండే ఈ ​ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌‌‌‌కీ ఇంపార్టెన్స్​ ఉంది. నా పాత్ర పేరు స్మిత. మెచ్యూర్డ్‌‌గా, బ్రాడ్​ మైండ్‌‌తో ఉండే అమ్మాయిని. నా రోల్ అరగంటే ఉన్నా ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా ఉంటుంది. ఇప్పటి వరకు ప్రేమకు సంబంధించిన సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఈ కథ చాలా డిఫరెంట్. ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ల మధ్య ఉండే అభిమానం, ప్రేమ, బాధ ఇవన్నీ ఎలా ఉంటాయనేది ఇందులో చక్కగా చూపించారు.

సన్నివేశాలన్నీ ఎక్కడో ఒకచోట అందరికీ కనెక్టవుతాయి. ప్రేమ లేకపోతే జీవితమే ఉండదు. ఇంట్లోవాళ్లని ప్రేమిస్తాం. మనకు తెలిసిన వాళ్లను కూడా కొంతమందిని ఇష్టపడతాం. ఇక పెళ్లి అనేది నా దృష్టిలో లైఫ్​ లాంగ్​ చేసుకునే ఒక కమిట్‌‌మెంట్. అలాగే లివింగ్ ​రిలేషన్‌‌షిప్​ కూడా నాకు ఇష్టమే. ఇద్దరూ కొంతకాలం కలిసి జీవించి, తర్వాత వారి అభిప్రాయాలు కలిసి పెళ్లి చేసుకుంటే మరింత మంచిది. కానీ అది పూర్తిగా వాళ్ల మెంటల్​ ఎబిలిటీస్​పైనే ఆధారపడి ఉంటుంది. ఇక నేనొక పాత్ర చేస్తున్నానంటే నా ఒరిజినాలిటీని పక్కకు పెట్టి ఆ పాత్రలో లీనమైపోతాను.  ఏది చేసినా బాగా పర్‌‌‌‌ఫామ్​ చేశాననిపించుకోవడం నాకిష్టం. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను.  ఒక సినిమాలో కామెడీ టచ్ ఉన్న రోల్​ నాది.  కామెడీ, థ్రిల్లర్..​ ఏ జానర్‌‌‌‌ అయినా నాకు ఓకే. డిఫరెంట్ రోల్స్ చెయ్యాలి.. అంతే. విలనీ అయినా, బోల్డ్​ క్యారెక్టర్​ అయినా.. నా క్యారెక్టర్‌‌‌‌కి నేను న్యాయం చెయ్యాలనేది మాత్రమే ఆలోచిస్తాను. సక్సెస్​ రావాలంటే కష్టపడాలి కదా!