ఈ చైనా ఫొటో ప్రపంచాన్ని భయపెడుతోంది.. బాడీ కవర్లో వైరస్ చిన్నారి

ఈ చైనా ఫొటో ప్రపంచాన్ని భయపెడుతోంది.. బాడీ కవర్లో వైరస్ చిన్నారి

చైనాలోన్యూమోనియాకు సంబంధించి.. అంతుచిక్కని వైరస్ విజృంభిస్తుందని.. చైనా రాజధాని బీజింగ్ తోపాటు మరో రెండు నగరాల్లోని ఆస్పత్రులు అన్నీ పిల్లలతో కిటకిటలాడుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.ఈక్రమంలోనే మిగతా దేశాలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అలర్ట్ అయ్యింది. నిజమైన వివరాలు వెల్లడించా లని ఆదేశించింది చైనా దేశాన్ని. భారత్ సైతం అప్రమత్తం అయ్యింది. నిజం చెప్పు చైనా.. కరోనాల ముంచొద్దు.. వైరస్ వివరాలు వెల్లడించాలని కోవిడ్ ప్యానెల్ చీఫ్ డాక్టర్ అరోరా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.. 

లేటెస్ట్ గా చైనా నుంచి వచ్చిన ఓ ఫొటో సంచలనంగా మారింది. తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఓ పిల్లోడిని.. తండ్రి ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆ పిల్లోడు బాడీ కవర్ లో ఉండటం చర్చనీయాంశం అయ్యింది. ఆ చిన్నారికి వైరస్ ఎటాక్ కావటంతో.. మిగతా వాళ్లకు వ్యాపించకుండా.. ఆ చిన్నారికి బాడీ కవర్ వేశారు. ఈ ఫొటో గుండెలను పిండేస్తుంది.. అంతేనా.. చైనాలో వైరస్ వ్యాప్తి ఎలా ఉంది.. ఎలా భయపడుతున్నారు అనటానికే ఇదే సాక్ష్యం అంటున్నారు వైద్య నిపుణులు.

ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి బాడీ కవర్ వేయగా.. ఆ తండ్రి మాస్క్ ధరించి ఉన్నాడు. ఆస్పత్రిలో అడ్మిట్ చేయటానికి.. బెక్ కోసం వెయిట్ చేస్తున్నారు.. చైనాలో అంతుచిక్కని న్యూమోనియా వ్యాధి లక్షణాలతో ఉన్న ఈ వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉంది అనటానికి ఈ ఫొటోనే నిదర్శనంగా భావిస్తుంది ప్రపంచం.

ఓ చిన్నారికి బాడీ కవర్ వేయటం అంటే ఏంటీ.. వైరస్ వ్యాప్తి అవుతున్నట్లే కదా.. ఇంత పెద్ద జాగ్రత్త తీసుకుంటున్నారు అంటే.. చైనాలో వైరస్ విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు..