రామప్ప క్షేత్రంలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు

రామప్ప క్షేత్రంలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు

శిల్పకళకు కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం కాకతీయులు నిర్మించిన రామప్ప కేత్రం. చారిత్రక, అలనాటి వైభవాన్ని కళాత్మక శిల్పాలతో మన సంస్కృతి సాంప్రదాయలను కళ్లకు కట్టినట్లు నిర్మించారు. ఈ అద్భుత కట్టడానికి యునెస్కో గౌరవం దక్కింది. ఇందులో భాగంగా ఇవాళ యునోస్కో గుర్తింపు పొందిన రామప్పలో శిల్పం, వర్ణం, కృష్ణం పేరుతో  ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు జరపనున్నారు. ఈ ఉత్సవాలకు సినీ ప్రముఖులు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎమ్మేల్యే సీతక్క, మ్యూజిక్ డైరెక్టర్ తమన్,  శివమణి ఆధ్వర్యంలో  మ్యూజికల్ ప్రోగ్రాంను నిర్వహించనున్నారు. 

ఏమేం కార్యక్రమాలు జరుగుతాయంటే

ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రామప్ప ఆలయం పడమర దారి ఆర్‌అండ్‌బీ డబుల్‌రోడ్డుపై ఫుడ్‌ ఫెస్టివల్‌ చేపట్టనున్నారు.  సాయంత్రం 5:30 నుంచి 6 వరకు అరబీవాయిలీన్‌ వాయిద్య కళాకారుడు గురూజీ అశోక్‌గుజ్జల్‌ ప్రదర్శన ఉంటుంది. 6:15-నిమిషాల నుంచి 6:25 వరకు ప్రేరణి రాజ్‌కుమార్‌ బృందం నృత్య ప్రదర్శన చేస్తారు. 6:25 నుంచి -6:35 వరకు రామప్ప వారసత్వంపై వీడియో ప్రదర్శన జరుగుతుంది. 6:35 నుంచి -6:50 వరకు  రావణ ప్రదర్శన ఉంటుంది. 6:55 నుంచి రాత్రి 7:20 దేశ సంస్కృతి, సంప్రదాయ గిరిజన నృత్యం ప్రదర్శస్తారు. 7:20 నుంచి-7:30 వరకు బలగం చిత్ర బృందాన్ని సన్మానిస్తారు. 7:30 నుంచి-7:45 వరకు  విద్యాజ్యోతి రచించిన రామప్ప ఆలయం పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. 7:45 నుంచి -7:50 వరకు రామప్ప చరిత్రపై లేజర్‌ షో ఉంటుంది. 8:00 నుంచి- 8:15 వరకు  కళాకారులు, అతిథులు, దాతలను సన్మానిస్తారు. 8:15 నుంచి- 9:45 వరకు ఎస్‌ఎస్‌ తమన్‌, శివమణి, కార్తీక్‌, ప్లూట్‌ నవీన్‌ ఆధ్వర్యంలో మ్యూజికల్ ప్రోగ్రాం జరగనుంది. 9:45 నుంచి -9:50 వరకు ముగింపు కార్యక్రమం ఉంటుంది.