
ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన అంటోనోవ్ ఎన్ 124 అనే విమానం ఇవాళ(అక్టోబర్ 10) శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ఈ విమానం ఫొటోలను ఎయిర్ పోర్టు నిర్వహకులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీన్ని చూసేందుకు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు.
ప్రత్యేకతలు
ఈ విమానం ప్రపంచంలోనే అతిపెద్ద రెండో విమానం. ఈ విమానం ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ విమానానికి 4 ఇంజన్లు.. 24 చక్రాలు ఉంటాయి. దీనిలో లాంగ్ ట్రక్కులు నేరుగా లోడింగ్ .. అన్‌లోడ్ కోసం రాంప్‌లను ఉపయోగించి ప్రవేశించగలవు . ఒక్కో రెక్క వైశాల్యం 6760 చదరపు అడుగులు. ఖాళీ విమానం బరువు 1,81,000 కిలోలు. హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్లు, నౌకా కంటైనర్లు, ట్రక్కులు, ఇతర భారీ వస్తువులను కూడా రవాణా చేయగలదు.
గతంలో అతిపెద్ద విమానాల్లో ఒక్కటైన బెలూగా కార్గో విమానం తొలిసారిగా 2022 డిసెంబర్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఆ తర్వాత ఆగస్టు 1, 2023న శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది