Mani Ratnam: మణిరత్నం-విజయ్ సేతుపతి కాంబో రీపీట్.. హీరోయిన్‍గా సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్!

Mani Ratnam: మణిరత్నం-విజయ్ సేతుపతి కాంబో రీపీట్.. హీరోయిన్‍గా సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్!

'రోజా', 'బొంబాయి', 'దళపతి', 'గురు', 'గీతాంజలి' వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు మణిర త్నం. తాజాగా 'పొన్నియన్ సిల్వన్' ఫ్రాంచైజీతో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చిన ఆయన భారీ స్థాయి విజువల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'థగ్ లైఫ్' చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి ప్రాజెక్టును ప్రేమ కథగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీలో విజయ్ సేతుపతి, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరూ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చా రని తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే జనవరి లో అధికారికంగా ప్రకటించి, ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభించాలని మణిరత్నం భావస్తున్నారట. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్లు మొదట శింబును కథానాయకుడిగా తీసుకోవాలని ప్లాన్ చేశారని వార్తలొచ్చాయి.

అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్లో శింబు భాగం' కాలేకపోయారట. ఆ తర్వాత కథకు అనుగుణంగా విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు సమాచారం. విజయ్ సేతుపతి, మణిరత్నం కాంబినేషన్ గతంలో వచ్చిన 'సవాజ్' సినిమా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు రెండోసారి ఈ ఇద్దరి కలయిక రిపీట్ కాబోతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.