నిమ్స్​లో వరల్డ్ మూవ్​మెంట్ డిజార్డర్స్ డే

నిమ్స్​లో వరల్డ్ మూవ్​మెంట్ డిజార్డర్స్ డే

పంజాగుట్ట, వెలుగు: వరల్డ్ మూవ్​మెంట్ డిజార్డర్స్ డే సందర్భంగా బుధవారం పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్​లో న్యూరాలజీ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో అవేర్​నెస్ వాక్ నిర్వహించారు. మెదడులో న్యూరో ట్రాన్స్​మీటర్  వ్యత్యాసం కారణంగా నరాల బలహీనత, వణుకు, కండరాలు బిగుసుకుపోవడం జరుగుతుందని డాక్టర్ శిరీష తెలిపారు.

ఈ వ్యాధితో బాధపడుతున్న 20 మందికి  సీఎంఆర్ఎఫ్ ద్వారా నిమ్స్​లో  ట్రీట్ మెంట్ అందించామన్నారు. అవేర్​నెస్ వాక్​లో  నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డీన్ రాజశేఖర్, న్యూరో సర్జన్లు, ఫిజియోథెరపీ, నర్సింగ్ ఫ్యాకల్టీ  పాల్గొన్నారు.