రేపటి (మార్చి 27) నుంచి అంతర్జాతీయ బౌద్ధ మహాసభలు!

రేపటి (మార్చి 27) నుంచి అంతర్జాతీయ బౌద్ధ మహాసభలు!

హైదరాబాద్, వెలుగు: గౌతమ బుద్ధుడి బోధనలు, వారసత్వాన్ని చాటిచెప్పేందుకు తెలంగాణ సిద్ధమైంది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(టీజీటీడీసీ) బుద్ధవనం విభాగం, వియత్నాం బౌద్ధ సంఘం సంయుక్తంగా ‘ప్రపంచ శాంతి - అంతర్జాతీయ బౌద్ధ మహాసభలు-2026’ ను ఘనంగా నిర్వహించనున్నాయి. ఈ నెల 27 నుంచి 29 వరకు హైదరాబాద్, నాగార్జునసాగర్ వేదికలుగా వేడుకలు జరగనున్నాయి. 

22 దేశాల నుంచి సుమారు 150 మంది ప్రముఖ బౌద్ధ ప్రతినిధులు, పరిశోధకులు హాజరు కానున్నారు. బేగంపేటలోని ప్లాజా హోటల్‌లో శుక్రవారం మహాసభలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, శ్రీలంక మంత్రి హినిదుమ సునీల్ సేనవి గెస్టులుగా పాల్గొననున్నారు.