
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంగళవారం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నుంచి ‘ వీ6 వెలుగు’ సిద్దిపేట జిల్లా ఫొటో గ్రాఫర్ మహిమల భాస్కర్ రెడ్డి అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అవార్డుతో పాటు 20 వేల క్యాష్ ప్రైజ్ ను అందించారు. రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో భాగంగా ‘చేయూత’ కేటగిరీలో మొదటి బహుమతి పొందారు. కార్యక్రమంలో సమాచార ప్రత్యేక కమిషనర్ ప్రియాంక, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.