Health alert:ప్రతి రోజూ ఈ చిన్న చిన్న అలవాట్లు.. మీ కంటిచూపును పెంచుతాయి

Health alert:ప్రతి రోజూ ఈ చిన్న చిన్న అలవాట్లు.. మీ కంటిచూపును పెంచుతాయి

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు..కళ్లు ఎంత ముఖ్యమో..వాటికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మనోళ్లు ఇలా చెప్పారు. అవును..కంటిచూపు సరిగ్గా ఉంటేనేగా..మిగతామి అన్నీ.. అందుకే కళ్లను, కంటిచూపును కాపాడుకోవడం చాలా ముఖ్యం..ముఖ్యంగా మన కంటి వెనుక భాగంలోఉంటే చిన్న రెటీనాను కాపాడుకోవడం మరీముఖ్యం. దీంతోనే స్పష్టమైన దృష్టి మనకు లభిస్తుంది.  అది లేకుండా మీకు ఇష్టమైన పుస్తకాన్ని చదవడం, మీ ఫోన్‌లో స్క్రోల్ చేయడం ,ముఖాలను గుర్తించడం వంటివి నిజంగా కష్టమే. మరీ రెటీనా కాపాడుకోవడం ఎలా?రోజూ మనం ఈ చిన్న చిన్న అలవాట్లను పాటించడం ద్వారా కంటిచూపును కాపాడుకోవచ్చంటున్నారు డాక్టర్లు.. అవేంటో చూద్దాం.

సాధారణంగా రెటీనా ఉండే స్థితి, రెటీనా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా కంటిచూపును ఎలా మెరుగు చేసుకోవచ్చు..ప్రపంచ రెటీనా దినోత్సవం సందర్భంగా కంటి ఆరోగ్యం ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో జీవనశైలి మార్పుల కారణంగా డయాబెటిక్ రెటినోపతి ,మాక్యులర్ డీజెనరేషన్ వంటి రెటీనా కంటిసమస్యలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితినుంచి బయటపడాలంటే..క్రమం తప్పకుండా డైలేటెడ్ కంటి పరీక్షలు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రక్తంలో చక్కెర స్థాయిలను చెక్​ చేసుకోవడం, జీవనశైలిని మార్చుకోవడం వంటివి రెటీనా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కీలకం అంటున్నారు. రోజు ఇలా చేస్తే కంటిచూపును పొందే అవకాశం ఉందంటున్నారు. 

కంటి చూపు పెరగాలంటే.. ఇలా చేయండి 

రోజువారీ ఆహారంలో ఇవి ఉండాలి..విటమిన్ ఎ, సి, ఇ, జింక్, లుటిన్ ,జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇవి రెటీనాను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 

  • ఆకుకూరలు, పండ్లు ,కూరగాయలు వంటి ఆహారాలు కళ్ళ మొత్తం పనితీరుకు సపోర్టు చేస్తాయి. కాబట్టి తప్పకుండా మన ఆహారంలో చేర్చాలి. 
  • రెటీనాపై ఆక్సీకరణను తగ్గించే ఓ అలవాటు ధూమపానం.. దీనిని తప్పకుండా వదిలించుకోవాలి.
  • రక్తంలో చక్కెర , రక్తపోటు స్థాయిల మోతాదులో ఉండేలా చూసుకోవాలి. శరీర సాధారణ ఉష్ణోగ్రతను మెయింటెన్​ చేయాలి.
  • కంటిని రక్షించే అద్దాలు ఉపయోగించాలి.
  • స్క్రీన్ సమయం తగ్గించాలి.తగినంత నిద్రపోవాలి. 
  •  20/20/20 నియమాన్ని పాటించడం.. ప్రతి 20 సెకన్లకు రెప్పవేయడం,20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువులను చూడటం వంటివి చేస్తుండాలి. 
  • పని చేస్తున్నప్పుడు కళ్ళు పొడిబారడం, కంటి ఒత్తిడిని నివారించడానికి ఇది చాలా ముఖ్యం. 
  • కంటికి గాయాలు కాకుండా జాగ్రత వహించాలి. 

ఇలా జాగ్రత్తలు పాటిస్తూ.. అప్పుడప్పుడు కంటి  చెకప్ లు చేయించుకుంటూ ఏవైనా కంటి సమస్యలు తలెత్తే ముందే చికిత్స తీసుకుంటే మీ కంటిని ఆరోగ్యం ఉంచుకోవచ్చు. కంటిచూపును కాపాడుకోవచ్చు. 

►ALSO READ | Health alert: బోన్ క్యాన్సర్ ..ముందుగా కనిపించే 7 లక్షణాలు