
స్టావెంజర్: ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. నార్వే చెస్ టోర్నీలో సంచలన విజయాలతో హోరెత్తిస్తున్నాడు. మొన్న వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించిన ఇండియన్ ప్లేయర్ ఆదివారం జరిగిన ఐదో రౌండ్‌లో వరల్డ్ రెండో ర్యాంకర్ ఫ్యాబియానో కరువాన (అమెరికా)కు షాకిచ్చాడు. కాటలాన్ ఓపెనింగ్‌తో గేమ్ మొదలుపెట్టిన ప్రజ్క్షానంద కార్ల్‌సెంక్యూ ఎండ్‌గేమ్‌తో అమెరికన్‌కు చెక్ పెట్టాడు. ఈ రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద ఎనిమిదిన్నర పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉండగా, హికారు నకాముర (10), కార్ల్‌సన్ (9) టాప్–2లో కొనసాగుతున్నారు. విమెన్స్ సెక్షన్‌లో ఆర్. వైశాలి (10).. టింగ్‌జీ లీ (చైనా, 6)పై, గెలవగా, కోనేరు హంపి (4).. వెన్‌జున్ జు (చైనా, 7.5) చేతిలో ఓడింది.