అక్టోబర్ 15 వరకు వరల్డ్ స్కిల్ కాంపిటిషన్ అప్లికేషన్లు.. 63 విభాగాల్లో అప్లై చేసుకునే అవకాశం

అక్టోబర్ 15 వరకు వరల్డ్ స్కిల్ కాంపిటిషన్ అప్లికేషన్లు.. 63 విభాగాల్లో అప్లై చేసుకునే అవకాశం
  • టీజీసీహెచ్​ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: వరల్డ్ స్కిల్ కాంపిటిషన్​ 2026లో పాల్గొనే అభ్యర్థులు అక్టోబర్ 15లోగా ఆన్​లైన్​రిజిస్ర్టేషన్ చేసుకోవాలని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, కాంపిటిషన్ స్టేట్ కోఆర్డినేటర్ ప్రశాంతి తెలిపారు. ఈ పోటీల్లో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని, సత్తా చాటాలని కోరారు. 

సోమవారం (అక్టోబర్ 06) టీజీసీహెచ్ఈ ఆఫీసులో కౌన్సిల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. స్కిల్ కంపిటిషన్స్​ను స్కిల్ ఒలింపిక్స్ గా పిలుస్తారన్నారు. ఇండియా స్కిల్ పోటీలకు రాష్ట్రస్థాయిలో ఎంప్లాయిమెంట్ అండ్  ట్రైనింగ్ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉందన్నారు. 

సైబర్ సెక్యూరిటీ, వెబ్ టెక్నాలజీస్, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాలేషన్స్, కుకింగ్, బేకరీ, ల్యాండ్‌‌‌‌‌‌‌‌స్కేప్ గార్డెనింగ్, కన్ స్ర్టక్షన్​, జ్యువెలరీ, గ్రాఫిక్ డిజైన్,  వెల్డింగ్, బ్యూటీ థెరఫీ,రిటైల్ సేల్స్, కార్ పేయింటింగ్, హోటల్ రిసెప్షన్ వంటి 63 స్కిల్ విభాగాల్లో కాంపిటిషన్ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొనే అభ్యర్థులు www.skillindiadigital.gov.in  వెబ్ సైట్​లో ఉచితంగా రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చన్నారు.

డిసెంబర్ లోపు రాష్ట్రస్థాయి పోటీలు 

 వరల్డ్ స్కిల్ కాంపిటిషన్​కు ఇప్పటికే 5,500 అప్లికేషన్లు వచ్చాయని బాలకిష్టారెడ్డి తెలిపారు. వచ్చే నెలలో జోనల్ లెవెల్​ పోటీలు, డిసెంబర్ లోపు రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయన్నారు. వచ్చే ఏడాది సౌత్ రిజినల్ స్టేట్ పోటీలు, జాతీయ స్థాయి పోటీలు ఉంటాయని చెప్పారు. నేషనల్ లెవెల్​లో మొదటి స్థానంలో నిలిచిన వారు.. వచ్చేఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో చైనాలోని షాంఘైలో జరిగే పోటీలకు అర్హులుగా ఉంటారని వివరించారు. దీనికి చదువుతో సంబంధం లేదని, కేవలం 16 ఏండ్ల నుంచి 24 ఏండ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు.