ఎవరిదో టెస్ట్ కిరీటం.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఫైనల్.. సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా ఢీ.. ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కంగారూ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఎవరిదో టెస్ట్ కిరీటం.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఫైనల్.. సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా ఢీ.. ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కంగారూ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా ఢీ.. ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కంగారూ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • మధ్యాహ్నం 2 నుంచి స్టార్ స్పోర్ట్స్‌‌, జియో హాట్‌‌స్టార్‌‌‌‌లో లైవ్‌‌

లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రంగం సిద్ధమైంది. మెగా టోర్నీల్లో అద్భుత రికార్డు, అపార అనుభవంతో కూడిన ఆస్ట్రేలియా.. చోకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముద్రను చెరిపేసి ఐసీసీ ట్రోఫీ నెగ్గాలనే పట్టుదలతో నిండిన  సౌతాఫ్రికా జట్ల మధ్య ప్రఖ్యాత లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్ స్టేడియంలో బుధవారం నుంచి అసలైన టెస్ట్ సమరం షురూ కానుంది. డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోదాలో బరిలోకి దిగుతున్న ఆసీస్ ట్రోఫీ నిలబెట్టుకోవాలని ఆశిస్తుండగా.. అద్భుత ఆటతో ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన సఫారీలు తొలి ప్రయత్నంలోనే టెస్టు రారాజు అనిపించుకోవాలని భావిస్తోంది. 

అయితే, మేజర్ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడటం ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొట్టిన పిండి. మెన్స్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగు ఐసీసీ ట్రోఫీలైన  వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ గెలిచిన ఏకైక జట్టు ఆస్ట్రేలియానే. ఇప్పటివరకు ఆడిన 13 ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పదింటిలో గెలిచిందంటే ఆ టీమ్ ఆధిపత్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అదే జోరుతో ఇప్పుడు 11వ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కన్నేసింది. సఫారీలు దీనికి పూర్తి భిన్నం. ఆ జట్టుకు కీలక మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో తడబడుతుందనే పేరుంది. 1998లో ఒక్కసారి మాత్రమే చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సఫారీ టీమ్ ఈ సారి చాలా బలంగా కనిపిస్తోంది. ఆటగాళ్లు ఒకరికొకరు అండగా నిలబడుతూ, క్లిష్టపరిస్థితుల్లో కూడా గెలవడం నేర్చుకున్నారు. అందుకే డబ్ల్యూటీసీ సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుసగా ఏడు టెస్టులు గెలిచి టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరిన బవూమ అండ్ కో.. కంగారూలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో ఇరు జట్లకూ మంచి రికార్డుంది. ఇక్కడ గత పదేండ్లలో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కసారి కూడా ఓడలేదు. సౌతాఫ్రికా ఏడు టెస్టుల్లో ఒక్కదాంట్లోనే ఓడింది.
 
ఆ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పది మంది బరిలోకి

వెటరన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్ల కలయికతో కంగారూ టీమ్ ఎప్పట్లానే చాలా స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది. 2023 ఫైనల్లో ఇండియాను ఓడించిన ఆస్ట్రేలియా తుది జట్టులోని పది మంది ఆటగాళ్లు ప్రస్తుత టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఉన్నారు. టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన డేవిడ్ వార్నర్ ఒక్కడే మిస్సయ్యాడు. వార్నర్ లేకపోవడంతో ఉస్మాన్ ఖవాజా తోడు  ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.. గత డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాపై19 ఏండ్లకే అరంగేట్రం చేసిన సామ్ కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకున్నాడు. కానీ, ఫిబ్రవరిలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రావిస్ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చాడు. ఈ ఇద్దరిలో మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరికి మొగ్గు చూపిస్తుందో చూడాలి. 

లబుషేన్ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేకపోవడం కాస్త ఆందోళన కలిగించే విషయం. అలాగే, ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్ కామెరూన్ గ్రీన్ గాయం నుంచి కోలుకొని వచ్చి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటుతున్నా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంకా సిద్ధంగా లేడు. ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లబుషేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  గ్రీన్ గురించి తప్పితే మరే విషయంలో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇబ్బంది లేదు. ఎప్పట్లానే ఆ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రధాన బలం వారి బౌలింగే కానుంది.  కమిన్స్, స్టార్క్, హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లైయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి వరల్డ్ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లు ఆ జట్టు సొంతం. గాయం నుంచి కోలుకొని ఇటీవలి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెలరేగిన హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్ రాక వారి బలాన్ని మరింత పెంచింది.  సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్  చివరి ఐదు టెస్టుల్లో నాలుగు సెంచరీలు కొట్టి అద్భుతమైన ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండటం ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్ కానుంది. 

రబాడపై సఫారీల ఆశలు

సఫారీ టీమ్ ఈసారి అనుభవజ్ఞులతో నిండి ఉంది. జట్టులోని క్రికెటర్ల సగటు వయసు  29. 5 ఏండ్లు.  ఆటగాళ్ల మధ్య ఉన్న ఐక్యత, ఒకరికొకరు అండగా నిలబడాలనే పట్టుదలతోనే సఫారీలు అద్భుతాలు చేశారు. ఈ డబ్ల్యూటీసీ కోసం ఏకంగా 30 మందిని ఉపయోగించినా సరైన సమయంలో జట్టును గెలిపించే ఆటగాళ్లు ముందుకొచ్చారు. అందుకే, వరుసగా ఏడు టెస్టుల్లో గెలిచి ముందుగానే ఫైనల్ చేరుకుంది. మెగా ఫైనల్లో బౌలర్లపైనే సౌతాఫ్రికా భారీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఓపెనర్లకు సఫారీ డేంజర్ పేసర్ కగిసో రబాడ నుంచి పెద్ద సవాల్ ఎదురుకానుంది.  ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనర్ ఖవాజాను రబాడ పది ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఐదుసార్లు ఔట్ చేశాడు. తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 327 వికెట్లు పడగొట్టిన కగిసో మరో మూడు తీస్తే సౌతాఫ్రికా తరఫున నాలుగో టాప్ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలుస్తాడు. ఇక, డబ్ల్యూటీసీలో అద్భుతంగా బౌలింగ్ చేసిన మరో పేసర్ మార్కో యాన్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కూడా ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముప్పుంది. మూడో పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లుంగి ఎంగిడి వైపు మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మొగ్గు చూపింది. వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాస్త అనుకూలించినా కేశవ్​ మహారాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అద్భుతం చేయగలడు.  ఇక, సఫారీ బ్యాటింగ్ లైనప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓపెనర్ మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెప్టెన్ బవూమ తప్పితే మిగతా వాళ్లంతా ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొత్త కానుంది. ఇది సౌతాఫ్రికాకు కాస్త అడ్వాంటేజ్ అవ్వొచ్చు. ఓపెనర్లుగా మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్, ర్యాన్ రికెల్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బరిలోకి దిగనుండగా వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వియాన్ ముల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెప్టెన్ బవూమ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగుతారు. డబ్ల్యూటీసీలో సఫారీ టాప్ స్కోరర్ డేవిడ్ బెడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని తుది జట్టులోకి రావడం సఫారీలకు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్యూస్. 

పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/వాతావరణం

లార్డ్స్ పిచ్ కొంచెం పొడిగా ఉంది. ఇది స్పిన్నర్లకు కాస్త అనుకూలించొచ్చు. ఇటీవల ఇక్కడ ఆడిన అనుభవం లేదు. కాబట్టి పిచ్ ఎలా ఉంటుందో సరిగ్గా అంచనా వేయడం  ఇరు జట్లకూ కొంచెం కష్టమే. రాబోయే ఐదు రోజుల్లో వాతావరణం ఆహ్లాదంగా ఉండనుంది. మధ్యలో అప్పుడప్పుడు జల్లులు కురిసే సూచనలు ఉన్నాయి.

తుది జట్లు

సౌతాఫ్రికా: మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్, రికెల్టన్ (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), వియాన్ మల్డర్, బవూమ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్, కైల్ వెరెన్, మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.

ఆస్ట్రేలియా: ఖవాజా, లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్, అలెక్స్ క్యారీ ( కీపర్), కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్,  లైయన్, హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్.
 

మరిన్ని వార్తలు