ముగింపు దశకు చేరుకున్న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ నిర్మాణ పనులు

ముగింపు దశకు చేరుకున్న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ నిర్మాణ పనులు

ప్రపంచంలోనే అతి పెద్ద వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ నిర్మాణానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ సిద్ధమవుతోంది.  శంషాబాద్‌ సమీపంలో సుమారు 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ (డబ్ల్యూటీసీ) నిర్మాణం పనులు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం దీని మొదటి దశ పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కానుండగా.. ఇది 2025లో ప్రారంభం కానుంది.

3.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతోన్న ఈ ఐకానిక్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి సంబంధించి వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ (WTCA) తమ అధికారిక తేదీలను త్వరలోనే వెల్లడించనుంది. హైదరాబాద్‌లో 50 నుంచి 60 ఎకరాల్లో నిర్మించబోయే ఈ అతి పెద్ద నిర్మాణంలో బహుళ టవర్లు ఉండనున్నాయి. ఒక్కో టవర్‌లో 12 అంతస్తులను నిర్మించనున్నారు.

ఈ విశాలమైన నిర్మాణంలో రెండు ఎత్తైన కార్యాలయ భవనాలు, ఒక హోటల్ టవర్ ఉండనున్నాయి. మేము 'వాక్ టు వర్క్' అని పిలిచే ఈ వినూత్న భావన.. సౌలభ్యాన్ని పునర్నిర్వచిస్తుందని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ అసోసియేట్ డైరెక్టర్ విఘ్నేష్ నొక్కి చెప్పారు. వాణిజ్య సేవలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు.