వరల్డ్ కప్ హంగామా : 8 వేల మందితో ‘భారత్‌ ఆర్మీ’

వరల్డ్ కప్ హంగామా : 8 వేల మందితో ‘భారత్‌ ఆర్మీ’

ప్రపంచంలోని ఏ మూలలో ఇండి యా క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్ యాచ్‌ ఆడినా .. స్టేడియాలు నిండిపోతాయి. అక్కడ స్థిరపడ్డ మనవాళ్లకు తోడు ఇక్కడి నుంచి వెళ్లే వేలాది మంది అభిమాన గణంతో మైదానం అంతా కోలాహలంగా మారుతుంది. ఏడు దశాబ్దాల అనంతరం ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల టీమిండి యా టెస్టుసిరీస్‌ విజయం సాధించిన సమయంలో.. మైదానంలో ఆటగాళ్లంతా సంబరాలు చేసుకుంటుం టే.. అభిమానుల్లోనుం చి ‘భారత్‌ ఆర్మీ’పేరిట ఓ బృందం పెద్ద ఎత్తున మద్దతు తెలిపింది. తమ బ్యాండ్‌ తో స్టేడియాన్ని ఊర్రూతలూగించిం ది. అలాం టిది ఇప్పుడు ప్రపంచ కప్‌ లాంటి మెగా టోర్నీ ముందుంటే ఇకఊరుకుంటారా..అంతకుమించి హంగామా చేసేం దుకు సిద్ధమవుతున్నారు.

మే 30 నుం చి ఇంగ్లండ్‌ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ లో కోహ్లీసేన మనోస్థైర్ యాన్ని పెంచేందుకు ‘భారత్‌ ఆర్మీ’పే రుతో సుమారు 8 వేల మంది అభిమానులు రె డీ అవుతున్నారు. 22 దేశాల్లో ని వసిస్తున్న ఇండియన్స్‌ అంతా కలిసి ఓ సమూహంగా చేరి గోల చేసేందుకు యూకే బయలుదేరనున్నారు. ‘ఇంగ్లండ్‌ బేస్డ్‌ ఇండియన్స్‌ తో ఆర్మీ రెడీ అవుతోంది’అని ఈ సమూహాన్ని ఒక దగ్గరకు చేర్చడంలో కృషి చేసిన రాకేశ్‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.