ఇది తినాలంటే ఆస్తులు అమ్మాల్సిందే..  ఇంతకీ అందులో ఏముంది..?

ఇది తినాలంటే ఆస్తులు అమ్మాల్సిందే..  ఇంతకీ అందులో ఏముంది..?

ఎండలు మాడు పగులగొడుతున్నాయి. ఎర్రటి ఎండలో చల్లచల్లని ఐస్‌క్రీమ్ తింటే .. కూల్ కూల్గా గొంతులో దిగుతుంటే అబ్బా ప్రాణం లేచివస్తుంది కదూ. మరి ఐస్‌క్రీమ్ తినాలంటే తక్కువలో తక్కువ 25 రూపాయలన్నా ఖర్చు చేయాల్సిందే. అఫ్ కోర్స్ 10 రూపాయలకు కూడా ఐస్‌క్రీమ్ ఉంటుందనుకోండీ. ఐస్‌క్రీమ్ల ధరలు మహా ఉంటే ఓ రెండు మూడు వందల రూపాయలు అనుకోవచ్చు.  ఇంకా అయితే ఓ వెయ్యిరూపాయలు అనుకుందాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఐస్‌క్రీమ్ ధర అక్షరాలు రూ.5.2 లక్షలు... ఏంటి దిమ్మ తిరిగిపోయిందా..? మీరు చెప్పేది ఐస్‌క్రీమ్ ధరా? లేదా ఓ కారు ధరా? ఓ సారి ఆలోచించి చెప్పండీ అంటారా? నిజ్జంగా నిజం.. ఈ ఐస్‌క్రీమ్ ధర అక్షరాలు రూ.5.2 లక్షలు..

ఐస్ క్రీమ్ ధర రూ. 5.2 లక్షలు

జపాన్ కు చెందిన ఓ ఐస్ క్రీం కంపెనీ తయారు చేసింది. ఈ ఐస్‌క్రీమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించింది. ఈ ఖరీదైన ఐస్‌క్రీమ్ ధర 8,73,400 జపాన్ యెన్ లుగా నిర్ణయించింది. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.5.2 లక్షలన్నమాట. ఖరీదైన అరుదైన పదార్థాలతో జపాన్ కు చెందిన సెల్లాటో కంపెనీ ఈ ఐస్ క్రీమ్ ను తయారు చేసింది. ఇమాజినేటివ్ ఫ్యూజన్ వంటకాలకు ప్రసిద్ధి చెందిన చెఫ్ తడయోషి యమడ సాయంతో బైకుయా డెసర్ట్‌ను కంపెనీ తయారు చేయించింది. ఆయన ఒసాకాలోని రివి అనే రెస్టారెంట్‌లో హెడ్ చెఫ్‌గా ఉన్నారు. 

 అంత ధర ఎందుకు?

బైకుయా ఐస్‌క్రీమ్ ధర ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం. దాని తయారీలో వాడిన ప్రత్యేక పదార్థాలు ఇటలీలోని ఆల్బాలో పండించిన అరుదైన వైట్ ట్రఫుల్ వినియోగించారు. దీని ధర కిలోకు 2 మిలియన్ జపనీస్ యెన్ (సుమారు రూ.11.9 లక్షలు) ఉంటుంది. ఎడిబుల్ గోల్డ్, పార్మిజియానో ​​రెగ్జియానో, సేక్ లీస్ వంటి ఇతర ప్రత్యేక పదార్థాలను దీని తయారీకి వాడారు. ఈ విషయాన్ని పేర్కొంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఒక వీడియోను షేర్ చేసింది. అందులో బైకుయా ఐస్‌క్రీమ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. దీన్ని జపాన్‌లో OMER తయారు చేసింది. ఐస్‌క్రీమ్‌లో తినదగిన గోల్డ్ లీఫ్, వైట్ ట్రఫుల్, నేచురల్ చీజ్‌ ఉన్నాయి’ అని వీడియోకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ క్యాప్షన్ పెట్టింది.

ఖరీదైన అరుదైన పదార్థాలతో జపాన్ కు చెందిన సెల్లాటో కంపెనీ ఈ ఐస్ క్రీమ్ ను తయారు చేసింది. దీన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా గుర్తించింది. . ఇక ఈ ఐస్‌క్రీమ్ తయారు చేయటానికి సంవత్సరన్నర సమయం పట్టిందని కంపెనీ ప్రతినిధి ప్రకటించారు. 

అంతకాలం ఎందుకు ..?

 ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాతే తుది ఉత్పత్తిని తీసుకొచ్చారట. ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసి రుచి చూస్తే.. చివరికి వారికి నచ్చినట్టు ఆకారం, రుచిని సాధించడానికి అంత సమయం పట్టిందట. ప్రపంచంలో ఖరీదైన ఐస్ క్రీమ్ తయారు చేయాలన్న సంకల్పంతోనే దీన్ని రూపొందించారు. దీని ధరను చూసిన వారు, విన్నవారు కూడా ఓ మై గాడ్ అని అంటున్నారు. నిజమే మరి అలా అని తీరాల్సిందే అనేలా ఉందీ దీని ధర. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఈ ఐస్‌క్రీమ్ కు సంబంధించి 30 సెకన్ల వీడియోపై ఓ లుక్కేయండి.

https://twitter.com/GWR/status/1659137501607645186