ఒక్క వీడియోకు ఆరు కోట్లు

ఒక్క వీడియోకు ఆరు కోట్లు

న్యూయార్క్​: ఖాభీ లేమ్ వయసు 22 ఏళ్లే! అయితేనేం.. ఇతడి​పరిస్థితి తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఉంది. మనోడికి డబ్బు వరదలా వచ్చి పారుతోంది. టిక్​టాక్​లో ఒక్క వీడియో పెడితే దాదాపు 7.50 లక్షల డాలర్లు (దాదాపు రూ.5.98 కోట్లు) వచ్చిపడుతున్నాయి. 2020లో కరోనా ఎక్కువగా ఉన్నప్పుడు లేమ్ టిక్​టాక్​కు ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి వెనక్కి చూడలేదు. ఇప్పుడు ఈ స్టార్​కు 14.28 కోట్ల మంది ఫ్యాన్స్​ ఉన్నారు. బ్రాండ్​డీల్స్​, స్పాన్సర్డ్​ కంటెంట్​, ఫీచర్​ ఆఫర్ల ద్వారా డాలర్ల పంట పండిస్తున్నాడు. హ్యూగో బాస్ కోసం మిలన్ ఫ్యాషన్ వీక్‌‌‌‌ సందర్భంగా ఖాబీ ర్యాంప్‌‌‌‌పై క్యాట్​వాక్​ చేయడం, షో గురించి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పోస్ట్ చేయడం ద్వారా 4,50,000 డాలర్లు సంపాదించాడు.  2001లో సెనెగల్ నుండి తన తల్లిదండ్రులు, ముగ్గురు తోబుట్టువులతో ఇటలీకి వలస వచ్చిన లేమ్​ ఇటీవల ఫార్చ్యూన్‌‌‌‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఒక్కో క్లిప్‌‌‌‌కు  750,000 డాలర్ల వరకు సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు.  ఇంటర్నెట్ ఫేమ్‌‌‌‌ కొద్దికాలానికి మాత్రమే పాపులారిటీ ఉంటుందని చెప్పాడు. 'సైలెంట్​హ్యూమర్​'తో ఫేమస్ అయిన ఈ కుర్రోడు ఇప్పుడు ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నాడు.

ఇందుకోసం ప్రతిరోజూ ఒక ట్యూటర్‌‌‌‌ దగ్గరికి వెళ్తున్నాడు. అమెరికన్ సినిమాలు,  కార్టూన్‌‌‌‌లనూ చూస్తున్నాడు. సినిమాల్లో పని చేయాలనే తన కోరికను కూడా బయటపెట్టాడు. "నాకు చిన్నప్పటి నుండి జోక్స్​ అంటే ఇష్టం. ఇతరులను నవ్వించడం అంటే ఇష్టం.  నా అభిరుచులను ఇతర ప్రపంచంతో పంచుకోవడానికి నాకు అవకాశం అందించిన టిక్‌‌‌‌ టాక్‌‌‌‌కి థ్యాంక్స్​" అని లేమ్ 2021 ఆగస్టులో ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.  ఈ సంవత్సరం ప్రారంభంలో టీఎంజెడ్​కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.   లేమ్​ లాస్ట్​ టార్గెట్​ ఏమిటంటే  హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్‌‌‌‌తో కలిసి నటించడం.  స్మిత్ నటించిన 'ది ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్-ఎయిర్'ను తన చిన్న వయస్సులోనే చూశానని, నటుడిగా మారడానికి ఆ సినిమా తనను ప్రేరేపించిందని చెప్పాడు.