
వరల్డ్స్ షార్టెస్ట్ ఉమెన్‌గా గిన్నీస్ వరల్డ్ రికార్డుకెక్కిన జ్యోతి కిసాంజీ ఆమ్గే బుధవారం 27వ పుట్టినరోజు జరుపుకుంటుంది. డిసెంబర్ 16, 1993లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన అమ్గే.. కేవలం రెండు అడుగుల పొడవు అంటే 61.95 సెం.మీ పొడవుతో గిన్నీస్‌లో చోటు సంపాదించుకుంది. సాధారణంగా ఇటువంటి లోపాలతో పుట్టినవాళ్లు తక్కువ కాలం జీవిస్తారు. కానీ ఆమ్గే మాత్రం విజయవంతంగా 27వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆమ్గే 2009లో ఫ్యుజి టీవీలో వచ్చే బిక్కురి చోజిన్ 100 స్పెషల్ నెం. 2 ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది.
‘ఆమ్గే కేవలం 61.95 సెం.మీ (2 అడుగులు) పొడవు ఉన్నట్లు ఒక వైద్యుడి ద్వారా గుర్తించబడింది. ఆమె అతి తక్కువ పొడవుతో ఎక్కువ కాలం జీవించిన యువతిగా ధృవీకరించబడింది. ఆమ్గే ప్రస్తుత బరువు కేవలం 5.4 కిలోల బరువు. అది ఆమె పుట్టినప్పటి బరువు 4 కిలోల కంటే కేవలం 1.4 కేజీలు మాత్రమే ఎక్కువ. ఆమ్గే పొడవు నాగ్‌పూర్‌లోని వోక్‌హార్డ్ట్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ డాక్టర్ మనోజ్ పహుకర్ చేత కొలవబడింది. ఈ కొలతను జీడబ్ల్యూఆర్ న్యాయాధికారి రాబ్ మొల్లోయ్ పర్యవేక్షణలో నిర్వహించాం’అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది.
‘ఈ రికార్డ్ పొందడం నాకు బాగా అనిపించింది. నేను 2011లో 18 పుట్టినరోజు తర్వాత అధికారికంగా ఈ రికార్డును పొందాను’ అని జ్యోతి తెలిపింది.
ఆమ్గే తల్లి రంజనా మాట్లాడుతూ.. ‘ఆమ్గే ఐదేళ్ల వరకు సగటు పొట్టితనాన్ని కలిగి ఉంది. ఆ తర్వాత ఆమెకు అకోండ్రోప్లాసియా అని పిలువబడే మరుగుజ్జు జబ్బు ఉందని.. అందువల్ల ఆమ్గే ఒక నిర్దిష్ట ఎత్తుకు మించి ఎప్పటికీ పెరగదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తెలిపింది’ అని రంజనా పేర్కొంది.
For More News..