
పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం నాసిరకంగా ఉంటున్నాయి. పురుగులు పట్టి తుట్టెలు కట్టి బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా శివ్వంపేట మండలం లచ్చిరెడ్డి గూడెంలో ముక్కిపోయి పురుగులు ఉన్న రేషన్ బియ్యం రేషన్ షాప్ పంపిణీ చేశారు. దీంతో లబ్దిదారులు ఆందోళనకు దిగారు.
సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పి..ముక్కిపోయిన పురుగుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం నాసిరకమైనవి కావడంతో వాటికి పురుగులు పడుతున్నాయని వాపోయారు. బియ్యం అంతా పురుగులు పట్టి తుట్టెలు కట్టి ఉండటంతో ఎలా తినాలని ప్రశ్నించారు.
గోదాముల్లో నిల్వ
గోదాముల్లో నిల్వ ఉన్న స్టాక్‌ను పంపిస్తుండటంతో బియ్యం పురుగులు, తుట్టెలమయంగా మారిందని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో నాసిరక బియ్యం సరఫరా అవుతుందన్నారు. సివిల్ సప్లయ్ అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా నాసిరకం బియ్యం వస్తున్నాయని పలువురు డీలర్లు వాపోతున్నారు.