కొవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ మంచిదే

కొవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ మంచిదే

న్యూఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య అంతరాన్ని 12 నుంచి 16 వారాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు కొవిషీల్డ్ తొలి, రెండో డోసు తీసుకోవడానికి మధ్య 6 నుంచి 8 వారాల గ్యాప్ ఉండేది. ఈ విషయాన్ని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ యాంథోనీ ఫౌసీ స్వాగతించారు. ఎక్కువ మందికి టీకా ఇచ్చే క్రమంలో ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని ఫౌసీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్కువ వ్యాక్సిన్ లు లేనందున దీన్ని అవలంబిస్తున్నారు అనే కామెంట్ ను ఆయన కొట్టిపారేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవసరమైతే సైనిక దళాలను వినియోగించుకోవాలని భారత్ కు సూచించారు. ప్రైవేట్ సెక్టార్ కంటే ఇలాంటి విషయాల్లో రక్షణ దళాలను వాడుకోవడం బాగా పనికొస్తుందన్నారు. జవాన్ల వల్ల టీకా కార్యక్రమం వేగంగా పూర్తవుతుందని పేర్కొన్నారు.