అసలు అది రామాయణమే కాదు.. ఆదిపురుష్ రచయిత షాకింగ్ కామెంట్స్

అసలు అది రామాయణమే కాదు.. ఆదిపురుష్ రచయిత షాకింగ్ కామెంట్స్

ఆదిపురుష్(Adipurush) సినిమాపై వస్తున్న విమర్శలపై ఆ చిత్ర రచయిత మనోజ్ ముంతశిర్ శుక్లా(Manoj Muntashir) షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆదిపురుష్ అసలు రామాయణమే కాదంటూ ఆసక్తికర వ్యాఖలు చేశాడు. తాజాగా ఆదిపురుష్ సినిమాపై వస్తున్న విమర్శలపై స్పందించిన మనోజ్ ముంతశిర్ శుక్లా..

"మేము తీసింది రామాయణం కాదు.. మేము రామాయణం నుంచి స్ఫూర్తి పొందాం. ఈ విషయాన్ని మేం డిస్‌క్లైమర్‌లో కూడా ప్రస్తావించాం. రామాయణంలో జరిగే యుద్ధంలో కేవలం ఓ భాగం ఆధారంగానే ఆదిపురుష్‌ను తెరకెక్కించాం. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు మరోసారి దీని గురించి వివరణ ఇస్తున్నా. మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను తీశాం. అంతే కానీ మేం తీసింది సంపూర్ణ రామాయణం కాదు. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించాలి" అని చెప్పుకొచ్చాడు. 

ఇప్పటికే సినిమాపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపధ్యంలో.. తాజాగా రచయిత ఇచ్చిన వివరణపై సినీ ప్రేక్షకులు ఇంకా మండిపడుతున్నారు. ఇది రామాయణమే కానప్పుడు హనుమాన్ కోసం సీట్ ఎందుకు వదిలేయమన్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. విడుదల ముందు వరకు ఒక మాట విడుదలయ్యాక మరోమాట చెప్పకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.