రాయడం, చదవడం రాదు.. ఎలా పాసయ్యేది

రాయడం, చదవడం రాదు.. ఎలా పాసయ్యేది

సంగారెడ్డి జిల్లా: టెన్త్ క్లాస్ కు వచ్చినా విద్యార్థులకు చదవడం, రాయడం రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. శనివారం సంగారెడ్డి జిల్లా‌ కందిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో హరీష్ ఆకస్మిక తనిఖీలు చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన మంత్రి.. సడెన్ గా టెన్త్ క్లాస్ రూమ్ లోకి వెళ్లారు. విద్యార్ధులను ఒక్కక్కరిని లేపి సబ్జెక్టులోని ప్రశ్నలు అడిగారు. విద్యార్థులకు సబ్జెక్టు కాదుకదా.. కనీసం తెలుగులో రాయడం, చదవడం రాలేదు. మరికొంతమంది స్టూడెంట్స్ కి ఎక్కాలు చదవలేక పోయారు.  తెలుగులో సరిగ్గా వారి పేర్లు కూడా రాయలేకపోవడంతో మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి చెందారు.

విద్యార్థుల చదువు ఇలా ఉంటే టెన్త్ ఎలా పాసవుతారని టీచర్లను ప్రశ్నించారు మంత్రి. ఈ చదువులతో ప్రపంచంతో ఎలా పోటీ పడతారని విద్యార్ధులతో మాట్లాడారు. టీచర్లు 1వ తరగతి నుంచే విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దాలని, లేకుంటే పదో తరగతికి వచ్చినా ఇలాగే సుద్ధమొద్దులుగా తయారవుతారని తెలిపారు హరీష్. చదువుకునే ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ లో ఉండాలని విద్యార్థులకు సూచించారు మంత్రి.