బైకర్ దుర్మరణం.. రాంగ్ రూట్ డ్రైవింగ్ పర్యవసానం

బైకర్ దుర్మరణం.. రాంగ్ రూట్ డ్రైవింగ్ పర్యవసానం

సైబరాబాద్ :  రాంగ్ రూట్ డ్రైవింగ్ వెరీవెరీ డేంజర్.. అని తెలిసినా చాలామంది పట్టించుకోరు. రాంగ్ రూట్ లోని రాకపోకలు సాగిస్తుంటారు. తాజాగా మైలార్ దేవ్ పల్లి దుర్గానగర్ సిగ్నల్ దగ్గర రాంగ్ రూట్లో వెళ్తున్న వ్యక్తిని..  వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీకొట్టింది. తలకు హెల్మెట్ కూడా లేకపోవడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన సీసీ ఫుటేజీని సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయొద్దని ప్రజలను కోరారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తూ ఈవిధంగా గతంలోనూ ఎంతోమంది నగరం పరిధిలో మృత్యువాతపడ్డారు. ఐదు, పది నిమిషాలు ఆలస్యమైనా.. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ  వాహనాలను నడపడం మంచిదని వాహనదారులు గుర్తించాలి.