
ఎల్ బీ నగర్, వెలుగు: రాంగ్ రూట్ లో వేగంగా వస్తున్న యాక్టీవా ఢీకొట్టడంతో బైక్పై వస్తున్న యువకుడు తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ చనిపోయిన ఘటన ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఎల్ బీనగర్ లో ఉంటున్న ఎస్ కే బాషా( 24) లిమ్రా హోటల్లో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం బైక్పై వస్తుండగా నాగోల్ చౌరస్తా దగ్గర ఎదురుగా రాంగ్రూట్లో యాక్టివావై వచ్చిన వ్యక్తి ఢీకొట్టాడు. ఈ ఘటనలో బాషాకు తీవ్రగాయాలవడంతో స్థానికులు హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు మృతుడి తండ్రి మహబూబ్ ఫిర్యా దుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.