డబ్ల్యూటీసీ ఫైనల్స్‌: పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదిరింది..ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 212కు ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

డబ్ల్యూటీసీ ఫైనల్స్‌: పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదిరింది..ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 212కు ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • వెబ్‌‌‌‌స్టర్‌‌‌‌, స్మిత్‌‌‌‌ హాఫ్‌‌‌‌ సెంచరీలు
  • తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో సౌతాఫ్రికా 43/4
  • హాజిల్‌‌‌‌వుడ్‌‌‌‌కు రెండు వికెట్లు

లండన్‌‌‌‌: ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌‌‌‌ రసవత్తరంగా మొదలైంది. సఫారీ పేసర్లు కగిసో రబాడ (5/51), మార్కో యాన్సెన్‌‌‌‌ (3/49) పేస్–స్వింగ్‌‌‌‌తో బెంబేలెత్తించడంతో కంగారూలు కుదేలయ్యారు. దీంతో బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌‌‌‌లో.. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 56.4 ఓవర్లలో 212 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. బ్యూ వెబ్‌‌‌‌స్టర్‌‌‌‌ (92 బాల్స్‌‌‌‌లో 11 ఫోర్లతో 72), స్టీవ్‌‌‌‌ స్మిత్‌‌‌‌ (112 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లతో 66) హాఫ్‌‌‌‌ సెంచరీలు చేయగా, మిగతా వారు పెవిలియన్‌‌‌‌కు క్యూ కట్టారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన సౌతాఫ్రికానూ ఆసీస్‌‌‌‌ పేసర్లు ఓ ఆటాడుకున్నారు. మిచెల్‌‌‌‌ స్టార్క్‌‌‌‌ (2/10), హాజిల్‌‌‌‌వుడ్‌‌‌‌ (1/10), కమిన్స్‌‌‌‌ (1/14) స్వింగ్‌‌‌‌తో దెబ్బకొట్టారు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 22 ఓవర్లలో43/4 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టారు. కెప్టెన్‌‌‌‌ బవూమ (3 బ్యాటింగ్‌‌‌‌), బెడింగ్‌‌‌‌హామ్‌‌‌‌ (8 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ప్రొటీస్‌‌‌‌ ఇంకా 169 రన్స్‌‌‌‌ వెనకబడి ఉంది.

సూపర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌..
డ్రై వికెట్‌‌‌‌పై ముందుగా బౌలింగ్‌‌‌‌ చేసిన సౌతాఫ్రికా పేసర్లు అద్భుతమైన లైన్‌‌‌‌ అండ్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌తో చెలరేగారు. బాల్‌‌‌‌ను రెండు వైపుల స్వింగ్‌‌‌‌ చేస్తూ ఆసీస్‌‌‌‌ టాప్ ఆర్డర్‌‌‌‌ను వణికించారు. ఏడో ఓవర్‌‌‌‌లోనే రబాడ.. నాలుగు బాల్స్‌‌‌‌ తేడాలో ఉస్మాన్‌‌‌‌ ఖవాజ (0), కామెరూన్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ (4)ను ఔట్‌‌‌‌ చేసి అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న యాన్సెన్‌‌‌‌ కూడా వరుస విరామాల్లో మార్నస్‌‌‌‌ లబుషేన్‌‌‌‌ (17), ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌ (11)ను పెవిలియన్‌‌‌‌కు పంపాడు. ఫలితంగా ఆసీస్‌‌‌‌ 67/4 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో స్మిత్‌‌‌‌, వెబ్‌‌‌‌స్టర్‌‌‌‌ ఒంటరి పోరాటం మొదలుపెట్టారు. కెప్టెన్‌‌‌‌ బవుమా క్రమం తప్పకుండా బౌలర్లను మారుస్తూ ఈ ఇద్దరిపై ఒత్తిడి పెంచాడు. అయితే స్మిత్‌‌‌‌ డెడ్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌కు వెళ్లగా.. రెండో ఎండ్‌‌‌‌లో వెబ్‌‌‌‌స్టర్‌‌‌‌ అప్పుడప్పుడు బ్యాట్‌‌‌‌ ఝుళిపించాడు. దాదాపు 19 ఓవర్ల పాటు ఈ ఇద్దరు క్రీజులో పాతుకుపోయి ఇన్నింగ్స్‌‌‌‌ను గాడిలో పెట్టారు. ఈ క్రమంలో స్మిత్‌‌‌‌ 76 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు.

ఇక ఫర్వాలేదనుకుంటున్న టైమ్‌‌‌‌లో 42వ ఓవర్‌‌‌‌లో పార్ట్‌‌‌‌టైమర్‌‌‌‌గా వచ్చిన మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (1/5).. స్మిత్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేయడంతో నాలుగో వికెట్‌‌‌‌కు 79 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. వెబ్‌‌‌‌స్టర్‌‌‌‌కు అండగా నిలిచిన అలెక్స్‌‌‌‌ క్యారీ (23) ఉన్నంతసేపు మెరుగ్గా ఆడాడు. కానీ స్పిన్‌‌‌‌ను ఎదుర్కోవడంలో ఫెయిలయ్యాడు. 52వ ఓవర్‌‌‌‌లో కేశవ్‌‌‌‌ మహారాజ్‌‌‌‌ (1/19) వేసిన టర్నింగ్‌‌‌‌ బాల్‌‌‌‌ను రివర్స్‌‌‌‌ స్వీప్‌‌‌‌ చేయబోయి క్లీన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ అయ్యాడు. ఐదో వికెట్‌‌‌‌కు 46 రన్స్‌‌‌‌ జతయ్యాయి. ఈ టైమ్‌‌‌‌లో మళ్లీ బౌలింగ్‌‌‌‌కు దిగిన రబాడ వరుస ఓవర్ల (53, 55)లో కమిన్స్‌‌‌‌ (1), వెబ్‌‌‌‌స్టర్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి ఝలక్‌‌‌‌ ఇచ్చాడు. వెబ్‌‌‌‌స్టర్‌‌‌‌ 69 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ సాధించాడు. 56వ ఓవర్‌‌‌‌లో యాన్సెన్‌‌‌‌.. నేథన్‌‌‌‌ లైయన్‌‌‌‌ (0)ను పెవిలియన్‌‌‌‌కు పంపగా, తర్వాతి ఓవర్‌‌‌‌లోనే రబాడ.. స్టార్క్‌‌‌‌ (1)ను ఔట్‌‌‌‌ చేసి ఆసీస్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌కు తెరదించాడు. 

స్టార్క్‌‌‌‌ మెరుపులు..
ఆసీస్‌‌‌‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్న ఆనందం సౌతాఫ్రికాకు ఎక్కువసేపు ఉండలేదు. అప్పటికే పిచ్‌‌‌‌ స్వింగ్‌‌‌‌కు అనుకూలంగా మారడంతో.. స్టార్క్​ తొలి బాల్‌‌‌‌ నుంచే నిప్పులు చెరిగాడు. ఫలితంగా ఇన్నింగ్స్‌‌‌‌ ఆరో బాల్‌‌‌‌కే బలమైన ఇన్‌‌‌‌ స్వింగర్‌‌‌‌తో మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (0)ను దెబ్బకొట్టాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకముందే వికెట్ల పతనం మొదలైంది. రైన్‌‌‌‌ రికెల్టన్‌‌‌‌, వియాన్‌‌‌‌ ముల్డర్‌‌‌‌ (6) ఇన్నింగ్స్‌‌‌‌ను బాగు చేసే బాధ్యత తీసుకున్నారు. కానీ ఆసీస్‌‌‌‌ పేస్‌‌‌‌ త్రయం ముందు తేలిపోయారు. ఫలితంగా 9వ ఓవర్‌‌‌‌లో స్టార్క్‌‌‌‌.. రికెల్టన్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేసి మళ్లీ షాకిచ్చాడు. దీంతో సఫారీల స్కోరు 19/2గా మారింది. కాసేపు స్టార్క్‌‌‌‌ను పక్కనబెట్టిన హాజిల్‌‌‌‌వుడ్‌‌‌‌, కమిన్స్‌‌‌‌ రెండు వైపుల నుంచి మళ్లీ ఇన్‌‌‌‌, ఔట్‌‌‌‌ స్వింగ్‌‌‌‌తో దాడి మొదలుపెట్టారు. దీన్ని దీటుగా ఎదుర్కొనే క్రమంలో ముల్డర్‌‌‌‌, స్టబ్స్‌‌‌‌(2) ఐదు ఓవర్ల తేడాలో పెవిలియన్‌‌‌‌కు వచ్చేశారు. దాంతో సౌతాఫ్రికా 30/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. చివర్లో బవూమ, బెడింగ్‌‌‌‌హామ్‌‌‌‌ మరో వికెట్‌‌‌‌ పడకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు. 

సంక్షిప్త స్కోర్లు

  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 56.4 ఓవర్లలో 212 (వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 72, స్మిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 66, రబాడ 5/51, యాన్సెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3/49). 
  • సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 22 ఓవర్లలో 43/4 
  • (రికెల్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16, బవూమ 3*, స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2/10).

ఇంగ్లండ్‌‌ గడ్డపై టెస్టుల్లో అత్యధికసార్లు 50కి పైగా స్కోర్లు చేసిన తొలి విదేశీ బ్యాటర్‌‌ స్మిత్‌‌(18). అలన్‌‌ బోర్డర్‌‌ (17) రికార్డును బ్రేక్‌‌ చేశాడు. లార్డ్స్‌‌లో అత్యధిక రన్స్‌‌ చేసిన విదేశీ బ్యాటర్‌‌గానూ స్మిత్‌‌ (591) రికార్డులకెక్కాడు. వారెన్‌‌ బార్డ్‌‌స్లే (575)ను అధిగమించాడు.