వైరా సమగ్ర అభివృద్ధికి రూ.411 కోట్లకు పైగా నిధులు

వైరా సమగ్ర అభివృద్ధికి  రూ.411 కోట్లకు పైగా నిధులు

వైరా, వెలుగు: వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిరంతం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాందాస్​నాయక్​ అన్నారు. శనివారం క్యాంప్​ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.53.82 కోట్లు మంజూరు చేసిందని, ఆ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. వైరాలో 100 పడకల ప్రభుత్వాస్పత్రి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని తెలిపారు. 

తెలంగాణ గురుకుల సంక్షేమ సంఘం పాఠశాల ప్రాంగణంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అమృత్ పథకం కింద రూ.26 కోట్లతో వాటర్ ట్యాంకులు, పైప్‌‌లైన్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా వైరా అభివృద్ధి కోసం రూ.411 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.