తీర్మానాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి

తీర్మానాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో గ్రామసభ రసాభాసగా మారింది.  గ్రామ పునర్నిర్మాణానికి గ్రామపంచాయితీ తీర్మానం కోసం కలెక్టర్ సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. అయితే  ప్రజల అభిప్రాయం తీసుకోకుండా సర్పంచ్ గ్రామసభలో తీర్మానాలు చేశారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభ కంటే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.  గ్రామస్తుల అనుమానాలపై క్లారిటీ  ఇచ్చాకే జీపీ తీర్మానం చేయాలన్నారు. దీంతో ఇప్పుడున్నట్లుగానే కమ్యూనిటీ వర్గాల వారీగా గ్రామ పునర్నిర్మాణం చేస్తామని కలెక్టర్ తెలిపారు. అయితే  జీపీ తీర్మానం పై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కలెక్టర్  పమేలా మధ్యలోనే వెళ్లిపోయారు.

మరిన్ని వార్తల కోసం

తుఫాన్ ధాటికి కొట్టుకొచ్చిన ర‌థం.. ఏ దేశానిది..?

నేపాల్ బౌలర్ ‘పుష్ప’ సెలబ్రేషన్స్.. ఐసీసీ రియాక్షన్