నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

వెలుగు : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థా నం బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8 నుంచి 18 వరకు జరిగే వేడుకలకు బాలాలయం ముస్తాబైంది. యాదాద్రి పనులు పూర్తికాకపోవడంతో గతేడాది
మాదిరిగానే ఈ ఏడాది కూడా బాలాలయంలోనే ఉత్సవాలను నిర్వహించనున్నారు. 14న ఎదుర్కోలు, 15న రాత్రి స్వామివారి కల్యాణం కొండ కింద గల జడ్పీహెచ్‌ఎస్‌ ఆవరణలో నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నట్లు ఆలయ ఈవో ఎన్ గీతారెడ్డి తెలిపారు.

గవర్నర్ కు ఆహ్వానం
యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి గురువారం గవర్నర్ ను కలిశారు. నరసింహన్ దంపతులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. స్వామివారి ఉత్సవాల నిర్వహణ గురించి వారికి వివరించారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఆహ్వాన లేఖ, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.