V6 News

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్హనుమంతరావు

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్హనుమంతరావు

యాదాద్రి, వెలుగు: ప్రజలకు సేవ చేసే మంచి లీడర్లను ఎన్నుకోవడానికి ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్​హనుమంతరావు సూచించారు. వలిగొండ, ఆత్మకూరు మండలాల్లో ఆయన పర్యటించారు. పోలింగ్​ సామగ్రి, పోస్టల్​ బ్యాలెట్ ఓటింగ్​ను పరిశీలించారు. అనంతరం స్వీప్​2025లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు  హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 

ఆత్మకూరు మండలంలోని సర్వేపల్లిలో మోడల్ పోలింగ్ బూత్ ని పరిశీలించారు.  పోలింగ్ బూత్ ముందు  పచ్చని మొక్కలతో ఆహ్లాదకరంగా ఉండేలా  చూసుకోవాలన్నారు.  ఓటు వేయడానికి వచ్చే ప్రజలకు మంచి నీటి సదుపాయం, టెంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్​ వెంట డీఆర్​డీవో నాగిరెడ్డి ఉన్నారు.