ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ లో యాదాద్రి టాప్

ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ లో యాదాద్రి టాప్
  • ఇంటిపెద్ద చనిపోతే కేంద్రం రూ.20 వేల పరిహారం 
  • రాష్ట్రవ్యాప్తంగా11 నెలల్లో 21,371 అప్లికేషన్లు 
  • 7,252 మందికి మాత్రమే ఇప్పటివరకు సాయం చెల్లింపు  
  • ఎన్​ఎఫ్​బీఎస్​ పంపిణీలో యాదాద్రి జిల్లా ప్రథమం 
  • సూర్యాపేట, రంగారెడ్డి, మెదక్​లో ఒక్కరికీ ఇవ్వలే

యాదాద్రి, వెలుగు :  ఇంటి పెద్ద చనిపోతే బాధిత కుటుంబానికి కేంద్ర ప్రభుత్వ సాయం అందించడంలో యాదాద్రి జిల్లా టాప్​లో ఉంది. అప్లికేషన్ ​చేసుకున్న వారిలో 10 మందికి మినహా జిల్లా అధికారులు అందరికీ సాయం పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా యాదాద్రి జిల్లా తర్వాత కరీంనగర్ ​జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మూడు జిల్లాల్లో మాత్రం ఒక్కరికీ సాయం చేయలేదు. 

ఇంటి పెద్ద చనిపోతే..

ఇంటి పెద్ద చనిపోతే కేంద్ర ప్రభుత్వ సాయం అందించడానికి 1995లో అప్పటి కాంగ్రెస్​ కేంద్ర ప్రభుత్వం నేషనల్​ఫ్యామిలీ బెనిఫిట్​స్కీమ్(ఎన్ఎఫ్​బీఎస్​) అమలులోకి తెచ్చింది. ఈ స్కీమ్​ద్వారా పేద, మధ్య తరగతికి కుటుంబాలకు చెందిన 18 –59 ఏండ్ల మధ్య వయసులోపు ఇంటి పెద్ద చనిపోతే రూ. 20 వేలు సాయం అందుతుంది. ఇందుకు ఏడాదికి కుటుంబ ఆదాయం గ్రామాల్లోనైతే రూ. 1.50 లక్షలు, పట్టణాల్లోనైతే  రూ. 2 లక్షలలోపు ఉండాలి. 

అప్పుడే ఆ కుటుంబానికి అర్హత ఉంటుంది. అయితే కుటుంబ పెద్ద మరణించినా, యాక్సిడెం ట్​లేదా ఆత్మహత్యకు పాల్పడినా సాయం దక్కుతుంది. మరణించిన కుటుంబ పెద్ద  భార్యకు ఎన్​ఎఫ్​బీఎస్​నుంచి సాయం వస్తుంది. అదే.. భర్త చనిపోయి కుటుంబ పెద్దగా మహిళ ఉండి మృతిచెందినా ఆమె పిల్లలు స్కీమ్​ద్వారా సాయం పొందవచ్చు.  

 ప్రచారం ద్వారా పెరిగిన అప్లికేషన్లు

ఈ స్కీమ్​పై గతంలో పెద్దగా ప్రచారం లేదు. దీంతో అప్లికేషన్లు చాలా తక్కువగా వచ్చేవి.  గత ఆరు నెలలుగా ఈ స్కీమ్​పై సెర్ఫ్​దృష్టి సారించింది. విస్తృత ప్రచారానికి చర్యలు తీసుకుం టోంది. దీంతో భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. తహసీల్దార్​ఆఫీసులో అప్లై చేసుకుంటే విచారణ చేసి ఆర్డీవోకు నివేదిక అందజేస్తారు. అటునుంచి ఆర్డీవో నుంచి డీఆర్వోకు వెళ్తుంది. అక్కడ పరిశీలించిన తర్వాత అప్లికేషన్​ను ఆన్​లైన్​లో అప్ లోడ్ చేస్తారు. ఆ తర్వాత సెర్ఫ్​సీఈవో పరిశీలించాక నేరుగా లబ్ధిదారైన కుటుంబ అకౌంట్ లో రూ. 20 వేలు జమ అవుతా యి. ప్రస్తుతం అప్లికేషన్లు పెరిగినా పరిష్కరించడంలో మాత్రం ఆలస్యం జరుగుతోంది. 

 యాదాద్రి జిల్లా టాప్​

మరణాంతరసాయం కోసం వచ్చిన అప్లికేషన్లను వెంటనే పరిష్కరించి సాయం అందించడంలో యాదాద్రి జిల్లా ముందు వరుసలో ఉంది. రెండు, మూడు స్థానాల్లో కరీంనగర్​, జనగామ జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత జనవరి నుంచి నవంబర్​వరకు 21,371 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో కేవలం 30 శాతం పరిష్కరించి లబ్ధిదారుల అకౌంట్లలో సాయం నగదు జమ చేశారు. యాదాద్రి జిల్లాలో వచ్చిన 1,748 అప్లికేషన్లలో 95 శాతం పరిష్కరించారు. నాలుగింటిని మాత్రమే తిరస్కరించారు.  జిల్లాలో వచ్చిన అప్లికేషన్లలో ఆర్​డీవో స్థాయిలో 82 పెండింగ్​ఉండగా, సెర్ఫ్​వద్ద మరో పది పెండింగ్​ఉన్నాయి. 

మిగిలిన 1,648 అప్లికేషన్లను అప్రూవ్​చేసి వారి అకౌంట్లలో అమౌంట్​జమ చేశా రు. కరీంనగర్​లో 1,405 అప్లికేషన్లు రాగా వివిధ స్థాయిల్లో పెండింగ్​ అప్లికేషన్లు పోగా 1,134 లబ్ధిదారుల అకౌంట్లలో సాయం జమ చేశారు. జనగామలో 1,195 దరఖాస్తులు రాగా, వీటిలో 1,128 మందికి సాయం అందింది. వనపర్తిలో అప్లికేషన్లు 658 వచ్చినా 574 మందికి సాయం అందించారు. 

మూడు జిల్లాల్లో ఒక్కరికీ సాయం అందలే.. 

నల్గొండ జిల్లాలో అత్యధికంగా 11, 560 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 198 మందికి సాయం అందించారు.  అదేవిధంగా రాష్ట్రంలో17 జిల్లాల్లో 10 నుంచి 50లోపే దరఖాస్తులు అందాయి. అందులో సగమే పరిష్కరించా రు. ఈ స్కీమ్​ కింద సాయం కోసం రంగారెడ్డి జిల్లాలో ఒక్క అప్లికేషన్​ కూడా రాలేదు. మెదక్​లో 8, సూర్యాపేటలో 344  అప్లికేషన్లు వచ్చినా ఒక్కరికీ సాయం దక్కలేదు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలో  21,371 అప్లికేషన్లు రాగా, ఇందులో 7,945 మందికి సాయం అందించారు.

అప్లికేషన్లను వెంటనే పరిష్కరిస్తున్నం

నేషనల్​ఫ్యామిలీ బెనిఫిట్​స్కీమ్ కోసం వచ్చిన అప్లికేషన్లను వెంట వెంటనే పరిష్కరిస్తున్నం. మొదట్లో ఒకటే అప్లికేషనే వచ్చింది. మండల ఆఫీసర్లతో మాట్లాడి వితంతు పింఛన్ల కోసం వచ్చిన అప్లికేషన్లను పరిశీలించాలని ఆదేశించాం. ఆ తర్వాత అప్లికేషన్లు పెరిగాయి. వచ్చిన వాటిని వచ్చినట్టే పరిష్కరిస్తున్నం. - వీరారెడ్డి, అడిషనల్​కలెక్టర్, యాదాద్రి జిల్లా 33