మొక్కు తీర్చుకున్న మనోజ్​ జంట.. 50 పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

మొక్కు తీర్చుకున్న  మనోజ్​ జంట.. 50 పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

తెలంగాణ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి  ఆలయాన్ని నవ దంపతులు మంచు మనోజ్ , భౌమ మౌనిక  సందర్శించారు. పెళ్లయిన అనంతరం ఆలయానికి రావాలని మొక్కుకున్నట్లు.. అందుకే వచ్చామని ఆ జంట తెలిపింది. ఈ జంటతో పాటు మనోజ్ సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న కూడా వచ్చారు. అంతకుముందు మంచు లక్ష్మీ గొప్ప హృదయం చాటుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లక్ష్మీ, మనోజ్, భూమిక .. కలెక్టర్ పమేలా సత్పత్తి, జిల్లా విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రైవేటు పాఠశాలలకు తగ్గట్టు స్మార్ట్ క్లాసెస్ ను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభిస్తామని మంచు లక్ష్మి తెలిపారు.1 నుంచి 5వ తరగతుల వరకు మూడేళ్ల పాటు స్మార్ట్ క్లాసెస్ నిర్వహిస్తామని, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించారు. సతీసమేతంగా హాజరైన మనోజ్ దంపతులతో పాటు లక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిన సీఎం కేసీఆర్ కు మనోజ్ ధన్యవాదాలు తెలిపారు. ఆలయం అందంగా ఉందని పేర్కొన్నారు.  ప్రస్తుతం మనోజ్ ‘వాట్ ది ఫిష్’ , ‘మనం మనం బరంపురం’ సినిమాలతో పాటు  మరో సినిమా కూడా చేస్తున్నాడు.