గుట్టలో బాలాలయం తొలగింపు

గుట్టలో బాలాలయం తొలగింపు

యాదగిరిగుట్టలోని బాలాలయాన్ని తొలగించే పనులను చేపట్టారు ఆలయ సిబ్బంది. స్వయంభూ నారసింహుడి ప్రధానాలయం అందుబాటులోకి రావడంతో బాలాలయాన్ని తొలగిస్తున్నారు అధికారులు. ఆలయ నిర్మాణ పనుల కారణంగా.. 2016లో కొండపై బాలాలయం ఏర్పాటు చేశారు. 2016 ఏప్రిల్ 21న గర్భగుడిలో ఉన్న స్వామివారి కవచమూర్తులను బాలాలయంలో ప్రతిష్ఠించారు. త్రిదండి చిన్నజీయర్ ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ చేసి భక్తులకు దర్శనాలు కల్పించారు. 2016 నుంచి ఈ ఏడాది మార్చి వరకు దాదాపు ఆరేళ్ల పాటు బాలాలయంలోనే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు, పవిత్రోత్స వాలు, దర్శనాలు కొనసాగాయి. ఇప్పుడు ప్రధానాలయం అందుబాటులోకి రావడంతో బాలాలయాన్ని తొలగిస్తున్నారు అధికారులు.