యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
  • ధర్మ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి అరగంట

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సహా, చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే కనిపించింది. కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. 

రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి రెండు గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంటకుపైగా టైం పట్టిందని భక్తులు తెలిపారు. మరో వైపు ఆలయంలో నిర్వహించిన సుదర్శన నారసింహ హోమం, స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలో భక్తులు సతీసమేతంగా వ్రతాలు నిర్వహించుకున్నారు. ఆలయంలో శనివారం ఉదయం సుప్రభాత పూజతో మొదలైన నిత్య పూజలు రాత్రి పవళింపుసేవ, శయనోత్సవంతో ముగిశాయి.