- ఈ నెల 23 వరకు నిర్వహణ
యాదగిరిగుట్ట, వెలుగు : వానలు పడాలని కోరుతూ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నుంచి 'వర్ష పాశుపత వరుణ యాగం' నిర్వహించనున్నారు. సోమవారం ప్రారంభం కానున్న ఈ యాగం ఈ నెల 23 వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని ఈవో భవానీ శంకర్ తెలిపారు. వరుణ యాగంలో భాగంగా శివ మూలమంత్ర జపం, వరుణ జపం, రుష్యశృంగ జపాలు, మండపారాధనలు, శత రుద్రాభిషేకాలు, విరాటపర్వ పారాయణం వంటి పూజలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
