సీఎం రేవంత్ ను కలిసిన యాదగిరిగుట్ట టెంపుల్ ఈఓ

సీఎం రేవంత్ ను కలిసిన యాదగిరిగుట్ట టెంపుల్ ఈఓ

యాదగిరిగుట్ట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈఓ, సీనియర్ ఐఏఎస్ అధికారి వెంకటరావు శనివారం హైదరాబాద్‌‌‌‌లో  మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ ఈఓగా తనను రీఅపాయింట్ చేసి స్వామివారికి, భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ కు ఈవో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

అనంతరం సీఎంకు యాదగిరిగుట్ట ఆలయ లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. ఆలయ ఈవో వెంకటరావు మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట దేవస్థానాన్ని టీటీడీ తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు.