యాదగిరిగుట్ట : యాదగిరిగుట్టపై సౌకర్యాలు లేక భక్తులు పడుతున్న ఇబ్బందులపై ‘ఎండొచ్చినా వానొచ్చినా భక్తులకు చుక్కలే’ శీర్షికతో ‘వెలుగు’లో వచ్చిన కథనానికి దేవస్థానం ఆఫీసర్లు స్పందించారు. భక్తులు ఇబ్బందులు పడుతున్న ప్రదేశాలను గుర్తించి శనివారం దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వానకు దెబ్బతిన్న, బురదమయం అయిన ఆలయ పరిసరాలకు రిపేపర్లు చేపట్టారు. వీఐపీ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు వెళ్లేదారిలో బురదను తొలగించి శాశ్వత ప్రాతిపదికన కృష్ణశిలలు వేసే పనులు షురూ చేశారు. తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి వెళ్లే క్యూలైన్లకు పైకప్పు లేకపోవడం, ఎండాకాలంలో వేసిన చలువ పందిళ్లు సరిగా లేక వానలతో భక్తులు తడి సి ముద్దయ్యారు. దీంతో చలువ పందిళ్లను తొలగించి, రేకులతో క్యూలైన్లకు పైకప్పు ఏర్పాటు చేసే పనులను మొదలుపెట్టారు. ప్రధా నాలయానికి దక్షిణం వైపున కృష్ణశిలలతో ఏర్పాటు చేసిన ఫ్లోరిం గ్ కుంగడంతో రాతిబండలు తొల గించి రిపేర్లు చేశారు. పది మీటర్ల విస్తీర్ణంలో కుంగిన ఫ్లోరింగ్ బండలను తొలగించి క్యూరింగ్ చేశారు.
