
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ సెగ్మెంట్లోని యాదవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఐడీఏ నాచారంలోని ఐడీఏ స్వాగత్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పనిచేస్తానన్నారు. తనను గెలిపిస్తే యాదవ సంఘం సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం యాదవ సంఘం నేతలు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో గొల్ల కురుమలకు చేయూతనిచ్చారన్నారు.
బండారి లక్ష్మారెడ్డికి మద్దతు ప్రకటిస్తూ నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం బీఆర్ఎస్ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, శాంతి మాట్లాడుతూ.. లక్ష్మారెడ్డిని గెలిపిస్తే సెగ్మెంట్లో మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ ఎర్రగొల్ల మల్లేష్ యాదవ్, సర్వ బాబు యాదవ్, అల్లాడి కృష్ణ యాదవ్, బొడ్డు బాలయ్య యాదవ్, గడ్డం కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.