యాదగిరిగుట్ట, వెలుగు:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను ఆలయ అధికారులు సోమవారం లెక్కించారు. భక్తుల కానుకల ద్వారా ఆలయానికి రూ.1,52,01,420 ఆదాయం సమకూరింది. అదేవిధంగా 54 గ్రాముల బంగారం, 2 కిలోల 700 గ్రాముల వెండి సైతం సమకూరిందని ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు.
అలాగే విదేశీ కరెన్సీ సైతం భక్తులు హుండీలలో భారీగా సమర్పించారు. 248 అమెరికా డాలర్లు, 15 ఇంగ్లాండ్ పౌండ్లు, 10 కెనడా డాలర్లు, దిరామ్స్ 60, నేపాల్ 10, ఆస్ట్రేలియా 55, రియాల్ 20 1/2, వియత్నాం 2000, మలేషియా 1, 220 థాయ్లాండ్, సింగపూర్ 27, టాంజానియా 20,000, సౌదీ అరేబియా 50, ఖతార్ 1, న్యూజిలాండ్ 20, యూరో 10 కరెన్సీ వచ్చినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు.
స్వామివారి సేవలో ఆర్టీఐ కమిషనర్
లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి దర్శించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు.
