యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. సాయంత్రం ప్రధానాలయ ముఖ మంటపంలో ఆలయ ప్రధానార్చకులు, వేద పండితులు, రుత్వికుల వేదమంత్రోచ్ఛారణల నడుమ తొలిరోజు వైదిక క్రతువులు భక్తిశ్రద్ధలతో సాగాయి. పవిత్రోత్సవాల సందర్భంగా ఈ నెల 23 నుంచి 24 వరకు రెండు రోజుల పాటు ఆర్జిత సేవలైన నారసింహుడి నిత్య, శాశ్వత కల్యాణాలు, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమంను తాత్కాలికంగా రద్దు చేశారు.
