యమహా ఫాసినో 2025 వేరియంట్ ధర రూ.80,750

యమహా ఫాసినో 2025 వేరియంట్ ధర రూ.80,750

2025 యమహా ఫాసినో 125 భారత్‌‌లో రూ.80,750 ప్రారంభ ధరకు అందుబాటులోకి వచ్చింది. టాప్ -వేరియంట్ ఫాసినో ఎస్‌‌లో కొత్త టీఎఫ్‌‌టీ  డిస్‌‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. దీని  ధర రూ.1.02 లక్షలు (ఎక్స్-షోరూమ్). గత వేరియంట్లతో పోలిస్తే ఈ కొత్త బండిలో  ‘ఎన్‌‌హాన్స్‌‌డ్ పవర్ అసిస్టు’ ఫీచర్‌‌‌‌ను అమర్చారు. ఇది యమహా హైబ్రిడ్ టెక్నాలజీపై ఆధారపడి పని చేస్తుంది. అధిక టార్క్‌‌తో వేగంగా స్టార్ట్ అవుతుంది. 125సీసీ బ్లూ కోర్ హైబ్రిడ్ ఇంజన్, ఈ20 ఫ్యూయల్‌‌కు ఇది అనుకూలం. 12-ఇంచుల వీల్స్, ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉన్నాయి.