ఐకానిక్ ఫుల్లీ ఫెయిర్డ్ యమహాR3, MT03 బైక్స్ వచ్చేస్తున్నాయ్..

ఐకానిక్ ఫుల్లీ ఫెయిర్డ్ యమహాR3, MT03 బైక్స్ వచ్చేస్తున్నాయ్..

యమహా తన కొత్త మోడళ్లు YZF-R3, MT-03 భారత్ లో విడుదల చేయనుంది. డిసెంబర్ 15న రెండు బైక్ లను ఒకేసారి లాంచ్ చేస్తోంది. యమహా YZF-R3, యమహా MT-03బైకులు ..డిజైన్ పరంగా భిన్నంగా ఉంటాయి. రెండు మోడల్స్ 321సీసీ, ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ మోటార్ల కలిగి ఉండి 42 బీహెచ్పీ, 29.6ఎన్ ఎమ్, ఆరు స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తోంది. ఈ మోడళ్లో హైలైట్ ఫీచర్లు ఏంటంటే.. LED అల్యూమినేషన్ , స్పీడోమీగర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టాకోమీటర్, గేర్ పోజిషన్ ఇండికేటర్, ఫ్యూయల్ లెవల్ రీ డౌట్ తో సహా LCD ఉంటాయి. 

యమహాMT-03, యమహాYZF-R3లలో కూడా హార్డ్ వేర్ ఒకేలా ఉంటుంది. రెండూ USC ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ అబ్జర్స్ పై ప్రయాణిస్తాయి. డ్యుయెల్ ఛానల్ ABS తో ముందు, వెనక ఒకే డిస్క్ ను కలిగి ఉంటుంది. Yamaha R3 స్ల్పిట్ LED హెడ్ లైట్, మధ్యలో డక్ట్ తో ఫుల్ ఫెయిర్డ్ బాడీ వర్క్ ను కలిగి ఉంటుంది. యమహా MT-03 పూర్తిస్థాయి నేకెడ్ మోటార్ సైకిల్.ఇది మధ్యలో ప్రొజెక్టర్ LEDతో సింగిల్ పాడ్ హెడ్ లైట్ ను కలిగి ఉంటుంది. పక్కన DRL లు ఉంటాయి. దీని ఫ్యూయెల్ ట్యాంక్ చాలా బీఫ్ గా కనిపిస్తుంది.  యమహా MT-03 బైక్ విజువల్ లైన్ అప్ కు మాస్ లుక్ జోడిస్తుంది. 

Yamaha  R3, MT-03 రెండు మోడల్స్ ఎంపిక చేసిన బ్లూ స్క్వేర్ డీలర్ షిప్ లలో అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 15న విడుదల చేసిన వెంటనే డెలివరీలు ప్రారంభం అవుతాయి.